వ్యాయామంతో క్యాన్సర్లూ దూరం!

18 Nov, 2019 03:00 IST|Sakshi

వ్యాయామంతో మంచి ఆరోగ్యం, ఆకర్షణీయమైన శరీర సౌష్టవం మన సొంతమవుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వ్యాయామంతో చాలా రకాల క్యాన్సర్లను సైతం నివారించవచ్చని అంటున్నారు పరిశోధకులు. ఒకటీ రెండు కాదు... ఏకంగా పదిహేను రకాలకు పైగా క్యాన్సర్లను దూరం పెట్టవచ్చని వారి అధ్యయనాల్లో తేలింది. ఇటీవలే కొద్దికాలం క్రితం అమెరికా, యూరప్‌లలో నిర్వహించిన అధ్యయనాలలో ఈ వాస్తవం నిరూపితమైంది.

సాధారణ వ్యక్తులతో పోలిస్తే నిత్యం వ్యాయామం చేసేవారికి ఈసోఫేజియల్‌ ఎడినోకార్సినోమా అనే ఒక తరహా క్యాన్సర్‌తో పాటు కాలేయ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, మూత్రపిండాల క్యాన్సర్, కడుపునకు సంబంధించిన క్యాన్సర్లు, రక్తానికి సంబంధించిన క్యాన్సర్లు, పెద్దపేగుల క్యాన్సర్, తల, మెడకు సంబంధించిన క్యాన్సర్లు, మలద్వార క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్‌... ఇలా అనేక రకాల క్యాన్సర్లు దూరమవుతాయని ఆ అధ్యయనాలలో స్పష్టంగా తేలింది.

వ్యాయామం వల్ల శరీరాన్ని ఉత్తేజపరిచే ఎండోక్రైన్‌ స్రావాలు తగినంత మోతాదులోనే అవుతుంటాయనీ, దాంతో అన్ని వ్యవస్థలూ పూర్తిగా మంచి అదుపులో ఉంటాయి. దాంతో అన్ని వ్యవస్థల మధ్య మంచి సమతౌల్యత సాధ్యమవుతుందంటూ అధ్యయనవేత్తలు చెబుతున్నారు. ఇన్ని  ఈ వివరాలన్నీ ‘జామా ఇంటర్నల్‌ మెడిసిన్‌’ అనే మెడికల్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇన్ని రకాల క్యాన్సర్లను నివారించడం అన్నది కేవలం ఒక వ్యాయామ ప్రక్రియతోనే జరుగుతున్నందున ఇంకెందుకు ఆలస్యం. పైగా ఇది వ్యాయామానికి అనువైన చలికాలం కావడం వల్ల వెంటనే ఎక్సర్‌సైజ్‌లు ప్రారంభించండి.

మరిన్ని వార్తలు