వీటితో అకాల మరణాలకు చెక్‌

10 Jun, 2019 19:48 IST|Sakshi

లండన్‌ : బీపీని అదుపులో ఉంచుకుని ఉప్పు, కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉంటే రానున్న 20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల అకాల మరణాలకు అడ్డుకట్ట వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. 2040 నాటికి గుండె జబ్బులను ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా పెద్ద ఎత్తున నియంత్రించవచ్చని వారు అంచనా వేస్తున్నారు. ఉప్పు, కొవ్వు పదార్ధాలతో తయారయ్యే ప్రాసెస్డ్‌ ఆహారాన్ని అధికంగా తీసుకుంటే రక్తపోటు తీవ్రమై గుండె జబ్బులకు దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. బీపీని చికిత్స ద్వారా నియంత్రించడం వల్ల కోట్లాది మందిని అకాల మృత్యువాత పడకుండా కాపాడవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు.

బీపీకి సరైన చికిత్స ద్వారా 4 కోట్ల మందిని, ఉప్పు వాడకం తగ్గించడం ద్వారా మరో 4 కోట్ల మందిని మరణాల ముప్పు నుంచి తప్పించవచ్చని హార్వర్డ్‌ యూనివర్సిటీ పరిశోధక బృందం వెల్లడించింది. ఇక కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉండటం ద్వారా 2040 నాటికి రెండు కోట్ల మందిని మృత్యువు అంచు నుంచి బయటపడవేయవచ్చని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పలు అథ్యయనాల్లో వెల్లడైన గణాంకాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా పరిశోధకులు ఈ అథ్యయనం చేపట్టారు.

మరిన్ని వార్తలు