ప్రాణాయామం

7 Sep, 2016 23:52 IST|Sakshi
ప్రాణాయామం

ఉజ్జయి ప్రాణాయామం


ఈ ప్రాణాయామాన్ని సాధన చేస్తే గొంతు, ముక్కు, చెవుల సమస్యలతోపాటు టీబీ, కఫం, ఉబ్బసం, ఉదర సంబంధిత రోగాలు కూడా నయమవుతాయి. మెదడు వేడి తగ్గుతుంది. శ్వాసకోశ వ్యవస్థ, కాలేయం శక్తిమంతం అవుతాయి. వీర్యపుష్టినిస్తుంది. ఇంకా గుండె వ్యాయామం చేసినట్లే.

ఎలా చేయాలంటే...
వజ్రాసనం లేదా పద్మాసన స్థితిలో కూర్చుని వెన్నెముకను నిటారుగా ఉంచాలి. ఎడమచేతిని చూపుడు వేలిని, బొటన వేలిని చివరలను కలిపి ఉంచేలా (చిన్ముద్రలో) ఉంచి ఆ చేతిని ఎడమ తొడ మీద పెట్టాలి. కుడి చేతి చూపుడు వేలు, మధ్య వేలిని మూసి బొటన వేలితో ముక్కు కుడిరంధ్రాన్ని, ఉంగరపు వేలు, చిటికెన వేలితో ఎడమ రంధ్రాన్ని పాక్షికంగా మూయాలి. ఇప్పుడు కళ్లు మూసుకుని గొంతుతో శబ్దం చేస్తూ దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి.

     
పూర్తిగా శ్వాస తీసుకున్న తర్వాత ముక్కు రంధ్రాలను పూర్తిగా మూసి శక్తి మేరకు అంతర కుంభకం (పొట్ట కండరాలను కదిలించడం) చేయాలి. ఆ తర్వాత తల పెకైత్తి శబ్దం చేస్తూ శ్వాసను వదలాలి. శబ్దం మధురంగా ఉండాలి. అంతేతప్ప తీవ్రస్థాయిలో ఉండకూడదు. ఇలా పది నుంచి 12 సార్లు చేసిన తరవాత విశ్రాంతి తీసుకోవాలి.

 

గమనిక:  మొదటి దశలోనే 10 రౌండ్లు చేయడం కష్టం. కాబట్టి ఐదారు రౌండ్లతో సరిపెట్టి, నిదానంగా పెంచుకోవాలి.శ్వాసను తీసుకునేటప్పుడు, వదిలేటప్పుడు కూడా ముక్కు రంధ్రాలను పాక్షికంగా మూసి ఉంచాలి. శబ్దం మొదటి నుంచి చివరి వరకు మృదువుగా ఒకే స్థాయిలో ఉండాలి. హెచ్చుతగ్గులు ఉండకూడదు.

 

 

 

మరిన్ని వార్తలు