తల్లుల బాధ్యత..

16 Oct, 2015 23:12 IST|Sakshi
తల్లుల బాధ్యత..

 కేరెంటింగ్

పసిపిల్లలకు స్నానానికి ముందు ఏదైనా నూనెతో మసాజ్ చేస్తుంటారు. దాంతో పాటు బ్రెడ్‌తో స్క్రబ్ కూడా చేస్తే వారి మృదువైన చర్మం మరింత కాంతిమంతంగా మారుతుంది. అందుకోసం 3-4 బ్రెడ్ ముక్కలను పచ్చిపాలలో నానబెట్టాలి. అందులోకి పాలు ఇంకి మెత్తగా అయ్యాక వాటిని పేస్ట్‌లా చేయాలి. ఆ మిశ్రమాన్ని పిల్లల చర్మానికి స్క్రబ్‌లా వాడాలి. అలా ప్రతిరోజూ చేస్తే మృదువైన చర్మంతో పాటు వారికి ఎలాంటి అలర్జీలు రాకుండా ఉంటాయి.

 చిన్నారులకు డైపర్లు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అవి వాడిన ప్రదేశాల్లో అలర్జీ, ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంట్లోనే డైపర్ క్రీమ్ తయారు చేసుకోవడం మంచిది. దానికి ఓ గిన్నెలో కొన్ని నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాలి. దాని పైన ఓ మూతలో కొద్దిగా కొబ్బరి నూనె, రెండు చేమంతి పూలు వేయాలి. కొద్దిసేపటి తర్వాత ఆ కొబ్బరి నూనె ఎల్లో క్రీమ్‌లా తయారవుతుంది. దాన్ని డైపర్ల అంచుకు రాస్తే అది మంచి లోషన్‌గా ఉపయోగపడుతుంది.

మరిన్ని వార్తలు