కలలో చిలుకా... కాస్త చెప్పవా!

22 Sep, 2014 23:00 IST|Sakshi
కలలో చిలుకా... కాస్త చెప్పవా!

స్వప్నలిపి
 
 చిలకది చూడచక్కని రూపం.
 ఏ చెట్టుపైనో చిలకను చూసీ చూడగానే ‘ఆహా’ అనుకుంటాం.
 మరి కలలో కనిపిస్తే?
 ‘ఆహా’ అనడం మాట అలా ఉంచి, కాస్త ఆలోచించాల్సిందే అంటున్నారు స్వప్నవిశ్లేషకులు. వారి విశ్లేషణల్లో కొన్ని...
     
చిలక మీ కలలో కనిపించింది అంటే, మీరు చేయకూడని వారితో స్నేహం చేస్తున్నారని అర్థం.
     
చిలక ఈకలు కలలో కనిపించడం అనేది... మీకు ఉన్న స్నేహితులలో బూటకపు స్నేహితులు, పక్కదారి పట్టించే స్నేహితులు ఎక్కువ ఉన్నారనేదాన్ని ప్రతిబింబిస్తుంది.
     
‘పంజరంలో చిలక’ కలలో కనిపిస్తే ... మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని పక్కదోవ పట్టిస్తున్నాయని లేదా ఊపిరి సలపని పనితో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అర్థం.
     
చిలక మిమ్మల్ని కొరికినట్లు కల వస్తే... మిమ్మల్ని చూసి కొందరు ఈర్ష్యపడుతున్నారని అర్థం. వేరే వాళ్లను చిలక కొరికినట్లు కల వస్తే... ఏదో విషయంలో ఆ వ్యక్తిని మీరు అప్రతిష్ఠపాలు చేస్తున్నట్లు అర్థం.
     
రెక్కలు దెబ్బతిన్న చిలక... ఎగరలేక ఇబ్బంది పడుతున్న దృశ్యం మీ కలలోకి వస్తే, మీరు మార్పు కోరుకుంటున్నప్పటికీ, ఆ మార్పుకు అవసరమైన పరిస్థితులు మీకు అనుకూలంగా లేవని అర్థం.
     
ఏం మాట్లాడినా...వల్లె వేసే చిలక కలలోకి వస్తే... మీకంటూ సొంత అభిప్రాయం లేకుండా ఉన్నారని, ఎవరు ఏది చెప్పినా దాన్ని గుడ్డిగా సమర్థించడం తప్ప, వాస్తవ ప్రాతిపాదికగా మీరు అభిప్రాయ ప్రకటన చేయడం లేదని అర్థం చేసుకోవాలి.
     
చేతిపైన చిలక వచ్చి కూర్చున్నట్లు యువతులకు కల వస్తే వారి ప్రేమ ఫలించడానికి సూచనగా అర్థం చేసుకోవాలి.
 

మరిన్ని వార్తలు