దేవుడికేం కావాలో!

3 Feb, 2020 01:23 IST|Sakshi

సాహిత్య మరమరాలు 

జాక్‌ లండన్‌ ఆత్మలాలసత గురించి ఒక్క విషయం చెప్పవచ్చు. ‘‘నా యిష్టం’’ అన్నమాటకు తిరుగులేదని అతను ‘‘క్రూయిజ్‌ ఆఫ్‌ ద స్నార్క్‌’’లో రాశాడు. అతని ఆత్మీయులు అతని యిష్టానికి తలవగ్గవలిసి వచ్చేది, లేకపోతే ఆత్మీయులు కాకుండా పోవలసిందే. చాలామందికి అతనిలో ఉన్న ఈ గుణం నచ్చలేదు. అతని కెప్పుడూ బోలెడంతమంది శత్రువులుండేవారు. మన్యూంగీ అనే జపనీయుడొకడు జాక్‌ లండన్‌కు నౌకరుగా ఉండేవాడు. వాడిలో తన యజమానిపై చాలాకాలంగా కసి పేరుతూ ఉండి ఉండాలి. ఒకనాడు జాక్‌ లండన్‌ అనేకమంది అతిథుల మధ్య ఉన్న సమయంలో వాడు పళ్లెంలో పానీయాలు తెచ్చి, తన యజమాని ముందు వంగి, అతి వినయంగా, ‘‘దేవుడికి బీర్‌ కావాలా?’’ అని అడిగి కసి తీర్చుకున్నాడు. అతిథులు నివ్వెర పోయారు. జాక్‌ లండన్‌ జీవితం రచించిన అతని భార్య అతని అహంకారాన్ని ‘‘రాజోచితమైనది’’ అన్నది.
(కొడవటిగంటి కుటుంబరావు తెలుగులోకి అనువదించిన జాక్‌ లండన్‌ ‘ప్రకృతి పిలుపు’ ముందుమాటలోంచి)
- ఫ్రాంక్‌ లూథర్‌మాట్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

థ్యాంక్స్‌ మోదీ... థ్యాంక్స్‌ డీడీ

కెఫ్కా సమర్పించు ‘కరోనా’ ఫిల్మ్స్‌

పాలడబ్బా కోసం ఫేస్‌బుక్‌ పోస్ట్‌

కరోనా కథ.. ఇల్లే సురక్షితం

మీరు వర్క్‌ చేసే ఫీల్డ్‌ అలాంటిది..

సినిమా

అను, అర్జున్‌ల పరిచయం అదిరింది

అంత పెద్ద మొత్తం ఇస్తానన్నపుడు.. : ట్వింకిల్‌

కరోనా ఎఫెక్ట్‌: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నితిన్‌ 

అల్లు అర్జున్ సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన త్రిష‌

నాలుగోసారి కూడా పాజిటివ్‌.. ఆందోళనలో కుటుంబం

నాతో నేను టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నా...