మరి ఆమె ఎవరు?

26 Aug, 2019 00:03 IST|Sakshi

సాహిత్య మరమరాలు

ఒకసారి ఆకాశవాణి హైదరాబాద్‌ ఆవరణలో జరిగిన సంఘటన. అప్పట్లో రేడియోలో స్పోకెన్‌ వర్డ్‌ ప్రయోక్తగా పనిచేస్తున్న రావూరి భరద్వాజ గేటువైపు నడుస్తూ బయటికి వెళుతున్నారు. గేటులోంచి ఆకాశవాణికే చెందిన ఒక ఉన్నతాధికారి తన భార్యతో లోనికి ప్రవేశించారు. ఆయన రావూరి గారికి అభివాదం చేసి, తన భార్యని వారికి పరిచయం చేశారు. ఉన్నట్టుండి భరద్వాజ సీరియస్‌గా మొహం పెట్టి ‘‘మొన్నామధ్య భార్య అంటూ మరొకరినెవర్నో పరిచయం చేశారు?’’ అని అన్నారు. దాంతో ఆ అధికారి బిత్తరపోయి ఇబ్బందిగా మొహం పెట్టారు. తన చమత్కారానికి తనే భళ్లున నవ్వేస్తూ వాతావరణాన్ని తేలికపరిచారు రావూరి. విషయం అర్థమయ్యి దంపతులిద్దరూ ఫక్కున నవ్వారు.

-ఎస్‌.హనుమంతరావు
(ఆకాశవాణి విశ్రాంత అధికారి)

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మోదీ సంకల్పం కోసం పురాణపండ

కరోనా: గొప్పవాడివయ్యా

రైట్‌ పర్సన్‌కు రాంగ్‌ నంబర్‌

తలుపులు తెరుద్దాం..

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సురక్షితమే

సినిమా

డ్రైవర్‌ పుష్పరాజ్‌

చిన్న స్క్రీన్‌ పెద్ద ఊరట

ప్రముఖ బాలీవుడ్ నిర్మాతకు పాజిటివ్

క్రికెట‌ర్‌ను కొట్టిన ప్రియ‌మ‌ణి..ఏమైందంటే?

బన్నీ ‘ఐకాన్‌’పై మరోసారి క్లారిటీ..

ప్ర‌భాస్‌ను చిక్కుల్లోకి నెట్టిన అభిమానులు