వెల్డింగ్ చేస్తాను. కంటికి రక్షణ ఎలా?

3 Nov, 2016 23:37 IST|Sakshi

ఐ కౌన్సెలింగ్

నా వయుస్సు 25 ఏళ్లు. నా చిన్నతనంలో 6, 7 ఏళ్ల వయుసప్పుడు తల వెనుకభాగాన 2,3 సార్లు రారుు తగిలి తీవ్ర రక్తస్రావం అరుు్యంది. ఒక్కోసారి తల బరువుగానూ, దివుు్మగానూ ఉంటుంది. తల గట్టిగా పట్టేసినట్లు ఉంటుంది. చిన్నప్పటి నుంచి కళ్లు నీళ్లు కారుతూ ఉంటారుు. డాక్టర్ గారిని సంప్రదిస్తే విటమిన్-ఏ లోపం వల్ల ఇలా అవుతోంది, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవున్నారు. కానీ నీళ్లు కారుతూనే ఉన్నారుు. నేను వెల్డింగ్ చేస్తాను. దీని వల్ల ఏదైనా కళ్ల సవుస్యలు వస్తాయూ? కళ్ల నుంచి నీరు కారడం తగ్గాలంటే నేను ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? - రమేశ్, ఏలూరు
మీకు తల దివుు్మగా బరువుగా ఉన్నట్లు ఉండటానికీ మీ చిన్నప్పటి దెబ్బ కారణం కావచ్చు, కాకపోవచ్చు కూడా. అరుుతే ఆ విషయూన్ని నిర్ధరించడానికి మీరు న్యూరో ఫిజీషియున్‌ను కలవండి. మీరు వెల్డింగ్ చేసే వృత్తిలో ఉన్నారు కాబట్టి మీరు చేసే పని వల్ల కలిగే వృత్తిపరమైన సవుస్య (ప్రొఫెషనల్ హజార్డ్) ప్రభావం కంటిపైన కూడా పడవచ్చు. వెల్డింగ్ వల్ల ప్రధానంగా వుూడు రకాల సవుస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒకటి... కంటి పైభాగం కార్నియూలో పైపొర అరుగుదల (ఎపిథీలియుల్ ఎరోజన్).  ఎపిథీలియుల్ ఎరోజన్ లక్షణాలు... వెలుగు చూడలేకపోవడం, నీళ్లు కారడం, ఎరుపెక్కడం, కన్ను నొప్పిగా ఉండటం వంటివి. రెండోది... వెల్డింగ్ సవుయుంలో నేరుగా ఆ లైట్‌కు ఎక్స్‌పోజ్ అవుతున్నందువల్ల రెటీనాలో బర్న్స్ రావచ్చు. ఇందువల్ల కంటిచూపు వుందగించడం, కొంతవుందిలో చూపు పూర్తిగా తగ్గిపోవడం కూడా జరిగేందుకు ఆస్కారం ఉంది. వుూడోది... కొందరిలో క్యాటరాక్ట్ సవుస్యలు రావచ్చు. చూపు వుందగించడం వంటి లక్షణాలు కనిపిస్తే క్యాటరాక్ట్ ఉందేమో అని అనువూనించాలి. అందుకే... వెల్డింగ్ చేసేవాళ్లు తప్పనిసరిగా ఫిల్టరింగ్ గ్లాస్ ఉపయోగించాలి. అది అడ్డుగా పెట్టుకునే అద్దంలాగా ఉంటుంది. కావాలంటే  కళ్లజోడులో కూడా ఈ ఫిల్టర్స్ పెట్టుకోవచ్చు. ఈ ఫిల్టర్స్ అల్ట్రా వయొలెట్, ఇన్‌ఫ్రా రెడ్ కిరణాల నుంచి కంటికి రక్షణ కల్పిస్తారుు. పై లక్షణాల్లో ఏది కనిపించినా వెంటనే కంటి డాక్టర్‌కు చూపించాల్సిన అవసరం ఉంది. వెంటనే కంటి డాక్టర్‌ను సంప్రతించండి.

డాక్టర్ రవికుమార్ రెడ్డి
కంటి వైద్య నిపుణులు, మెడివిజన్ ఐ హాస్పిటల్, హైదరాబాద్


గుండెపోటును గుర్తించండిలా!
కార్డియాలజీ కౌన్సెలింగ్

మా నాన్నగారి వయసు 48 ఏళ్లు. ఈ మధ్య అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. మా నాన్నగారికి ఇదివరకు ఎలాంటి గుండెజబ్బులూ లేవు. ఇలా ఎందుకు జరిగింది? ఎవరిలో గుండెపోటు ఎక్కువగా వస్తుంది. ముప్పు ఉన్నప్పుడు దాన్ని  ముందుగానే తెలుసుకోవడం ఎలా?  - వాసు, నిజామాబాద్
మీరు చెప్పినదాన్ని బట్టి నాన్నగారికి వచ్చిన దాన్ని సడన్ కార్డియాక్ డెత్, లేదా సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటారు. అప్పటివరకు చురుకుగా పనిచేసిన మనిషి... హఠాత్తుగా గుండెపట్టుకుని విలవిలలాడుతూ పడిపోవడం ఆగమేఘాల మీద ఆసుపత్రికి తరలించే లోపే మనకు దక్కకుండా పోవడం వంటివి సడెన్ కార్డియాక్ అరెస్ట్ జరిగిన వారిలో కనిపిస్తాయి.

ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది?  గతంలో ఒకసారి గుండెపోటు బారిన పడ్డవారు  గుండె కండరం బలహీనంగా ఉన్నవారు  కుటుంబంలో హఠాన్మరణం చరిత్ర ఉన్నవారు   కుటుంబంలో గుండె విద్యుత్ సమస్యలు ఉన్నవారు  గుండె లయ అస్తవ్యస్తంగా ఉన్నవారు. పైన పేర్కొన్న వారితో పాటు ఇప్పటికే గుండెజబ్బు తీవ్రంగా ఉన్నవారిలో కూడా అకస్మాత్తుగా మరణం సంభవించవచ్చు.

ముప్పు ఉన్నా... రక్షించే మార్గమూ ఉంది...
క్షణాల్లో మనిషిని మృత్యుముఖానికి తీసుకెళ్లిపోయే సమస్య ఇది. అయితే ఎవరికైనా గుండెపోటు వస్తున్న ఘడియల్లో తక్షణం స్పందించి వారిని వేగంగా హాస్పిటల్‌కు తీసుకెళ్లగలిగితే వారిని రక్షించే అవకాశాలూ ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ హార్ట్ ఎటాక్ పై అవగాహన కలిగి ఉంటే మృత్యుముఖంలోకి వెళ్లిన మనిషిని కూడా తిరిగి బతికించే అవకాశాలుంటాయి. అందుకే దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహనను పెంచుకోవాలి.

గుండెపోటును గుర్తుపట్టడం ఎలా? ఎవరైనా హఠాత్తుగా ఛాతీలో అసౌకర్యంతో కుప్పకూలిపోతుంటే... వెంటనే వాళ్లు స్పృహలో ఉన్నారా, శ్వాస తీసుకుంటున్నారా లేదా అన్న అంశాలను చూడాలి. అవసరాన్ని బట్టి గుండె స్పందనలను పునరుద్ధరించే ప్రథమ చికిత్స (కార్డియో పల్మనరీ రిససియేషన్- సీపీఆర్) చేయాలి. సీపీఆర్ వల్ల కీలక ఘడియల్లో ప్రాణం పోసినట్లు అవుతుంది. చాలా దేశాల్లో సీపీఆర్‌పై శిక్షణ ఉంటుంది. గుండె స్పందనలు ఆగిన వ్యక్తికి సీపీఆర్ ఇచ్చి ఆంబులెన్స్ వచ్చే వరకు రక్షించగలిగితే దాదాపు కోల్పోయిన జీవితాన్ని నిలబెట్టినట్లవుతుంది. అందుకే సీపీఆర్‌పై శిక్షణ ఇవ్వడం, ఆ ప్రక్రియపై అవగాహన కలిగించాలి.

డాక్టర్ హేమంత్ కౌకుంట్ల కార్డియోథొరాసిక్ సర్జన్
సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్.

పైల్స్... తగ్గుతాయా?
హోమియో కౌన్సెలింగ్

నా వయసు 49 ఏళ్లు. నాకు కొంతకాలం నుంచి మలద్వారం వద్ద బుడిపెలా వస్తోంది. మల విసర్జన సమయంలో రక్తం పడుతోంది. అప్పుడప్పుడు సూదితో గుచ్చినట్లుగా నొప్పి వస్తోంది ఉంది. కూర్చోడానికి చాలా ఇబ్బందిగా ఉంది. డాక్టర్‌ను కలిస్తే పైల్స్ అన్నారు. హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా?  - చిన్నారెడ్డి, ఆదిలాబాద్
ఈ మధ్యకాలంలో తరచూ వినిపిస్తున్న సమస్యలలో ఇది ఒకటి.  మలద్వారపు గోడల మార్పుల వల్ల ఆ చివరన ఉండే రక్తనాళాలు (సిరలు) ఉబ్బి, మొలలుగా ఏర్పడతాయి. ఇవి మలాశయం లోపల, వెలుపల చిన్న చిన్న బుడిపెల రూపంలో ఏర్పడి ఇబ్బంది పెడతాయి.

మొలల దశలు: గ్రేడ్-1 దశలో మొలలు పైకి కనిపించవు. నొప్పి కూడా ఉండదు. కానీ రక్తం మాత్రం పడుతుంది.

గ్రేడ్-2లో రక్తం పడవచ్చు, పడకపోవచ్చు కానీ మల విసర్జన సమయంలో బయటకు వస్తాయి. వాటంతట అవే లోపలకు వెళ్లిపోతుంటాయి. గ్రేడ్-3లో మల విసర్జన చేసేటప్పుడు మొలలు బయటకు వస్తాయి. కానీ మల విసర్జన తర్వాత వాటంతట అవి లోపలికి పోకుండా వేలితో నెడితే లోనికి వెళ్తాయి. గ్రేడ్-4 దశలో మొలలు మలద్వారం బయటే ఉండిపోతాయి. నెట్టినా లోనికి వెళ్లవు.

కారణాలు:  మలబద్ధకం  మలవిసర్జన సమయంలో గట్టిగా ముక్కడం వల్ల అక్కడే ఉండే కండరబంధనం సాగిపోతుంది. తద్వారా మొలలు బయటకు పొడుచుకుని వస్తాయి    సరైన వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం  స్థూలకాయం (ఒబేసిటీ)  చాలాసేపు కూర్చొని పనిచేసే ఉద్యోగులకు ఈ సమస్య ఎక్కువ  మలబద్ధకం మాత్రమే గాక అతిగా విరేచనాలు కావడం కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు  మంచి పోషకాహారం తీసుకోకపోవడం  నీరు తక్కువగా తాగడం  ఎక్కువగా ప్రయాణాలు చేయడం  అధిక వేడి ప్రదేశంలో పనిచేస్తుండటం  మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు: నొప్పి, రక్తస్రావం, కొన్నిసార్లు దురద, ఏదో గుచ్చుతున్నట్లుగా నొప్పి  మలవిసర్జన సమయంలో ఇబ్బంది కలగడం

నివారణ:  మలబద్ధకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం సమయానికి భోజనం చేయడం ముఖ్యం  ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం  కొబ్బరినీళ్లు  నీరు ఎక్కువ మోతాదులో తీసుకోవడం  మసాలాలు, జంక్‌ఫుడ్, మాంసాహారం తక్కువగా తీసుకోవడం  మెత్తటి పరుపు మీద కూర్చోవడం వంటివి పైల్స్ నివారణకు తోడ్పడే కొన్ని జాగ్రత్తలు. హోమియోపతిలో రోగి శారీరక, మానసిక లక్షణాలను బట్టి వ్యాధి నిరోధక శక్తి పెంచేలా ఇచ్చే మందులు ఇచ్చి, వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా