చురుకైన కీళ్ల కోసం!

4 Jan, 2017 23:21 IST|Sakshi
చురుకైన కీళ్ల కోసం!


కీళ్లవాతం – ఆహారం

ఆర్థరైటిస్‌ (కీళ్లవాతం) తగ్గడానికి పైటోకెమికల్స్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఈ ఆహారం పైటోకీన్స్‌తో పోరాడుతుంది. కొన్ని పదార్థాలు కీళ్లవాతం బాధ పెరగడానికి కారణమవుతుంటాయి. అందుకే కేవలం మందుల మీద ఆధారపడకుండా డైట్‌చార్ట్‌ను మార్చుకోవడం ద్వారా చక్కటి ఉపశమనం పొందవచ్చు.

ఏమేమి తినకూడదో చూద్దాం!
గోధుమలు, బార్లీ, ఓట్స్, మొక్కజొన్న, రెడ్‌మీట్, చక్కెర, తేనె, పాలు, పాల ఉత్పత్తులు, నూనెలో వేయించిన పదార్థాలు, వేయించి ఉప్పు చల్లిన గింజలు, తీపి కోసం కృత్రిమంగా వాడే ట్యాబ్లెట్లు– లిక్విడ్‌లు, మైదా, బేకరీ ఉత్పత్తులను మినహాయించాలి.
కూరగాయల విషయానికి వస్తే... బంగాళాదుంప, వంకాయ, టొమాటో, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, వండి చల్లబరిచి నిల్వ చేసిన పదార్థాల (ఫ్రోజన్‌ ఫుడ్‌)కు కూడా వాతాన్ని పెంచే గుణం ఉంటుంది. టీ, కాఫీ, ఆల్కహాలు సేవనాన్ని పూర్తిగా మానేయాలి.

వీటిని తినవచ్చు!
ఏమేమి తినకూడదో తెలియచేసే జాబితా చూశాక ఇక తినడానికి ఏమున్నాయి? అనిపిస్తుంది. కానీ ఆర్థరైటిస్‌ బాధ నుంచి ఉపశమనాన్నిచ్చే ఆహారం చాలానే ఉంది. అరటి, మామిడి పండ్లు, స్ట్రాబెర్రీ, పుచ్చకాయ, తర్బూజ, బత్తాయి, కమలా వంటి సిట్రస్‌ ఫ్రూట్స్‌ బాగా తీసుకోవాలి.

కూరగాయల్లో... ఆకుకూరలు, మామిడికాయ, నిమ్మ, క్యారట్, క్యాబేజ్, క్యాలిఫ్లవర్, బ్రోకలి, లెటస్, అరటి, చిక్కుడు వంటి కాయగూరలు తీసుకోవచ్చు. అలాగే రోజుకు రెండు కప్పుల గ్రీన్‌టీ, జింజర్‌ టీ, మొలకలు, నువ్వులు, వీట్‌గ్రాస్, ముడిబియ్యంతో వండిన అన్నం, శనగలు, రాజ్మా వంటి పొట్టు తీయని ధాన్యాలు తీసుకోవాలి.

మరిన్ని వార్తలు