మందిపోటు
వినువీధిలో విహరిస్తున్న చంద్రుడు
ఉన్నపళంగా మబ్బుల్లోకి వెళ్లి
తలుపేసుకున్నాడు
లూటీ అయిన సూర్యుడు
జేబులో ఆత్మహత్య చేసుకున్నాడు
పసిబిడ్డలు ఏడుపు మానేశారు
రెక్కలు తెగిన పక్షులు
శూన్యం దూలానికి ఉరేసుకున్నాయి
గాలి స్తంభించింది
సముద్రం గడ్డకట్టింది
కుంగిపోయే శక్తి నశించి
భూమి ముఖం వివర్ణమైంది
క్యూలోచనలో రాత్రి పగలు
నిలువు పాదాల్లో చావు కొలువు
నిజం
9848351806
సహజాత
నిద్రకొచ్చి
పాపాయి
ఏడుస్తుంది.
అమ్మ
జోకొట్టి జోకొట్టి
మెత్తటి పక్కమీద
పడుకో బెట్టింది.
ఇప్పుడు
బొమ్మను జోకొడ్తూ
పాపాయి
నిద్రపోతోంది.
కొండూరి రామరాజు
9542042003