లెక్కలు రావా?

13 May, 2019 00:40 IST|Sakshi

సాహిత్య మరమరాలు

అతిగా అలంకరించుకొని తన వయసును మరుగు పరచాలని తాపత్రయపడే ఓ వన్నెలాడి బెర్నార్డ్‌ షాని ఒక విందులో చూసి ఆయన్ని సమీపించింది. ‘‘మిస్టర్‌ షా! సరదాగా నా వయసు ఎంత ఉంటుందో చెప్పండి చూద్దాం’’ అంది వయ్యారం ఒలకబోస్తూ.
షా ఆమెను ఎగాదిగా చూస్తూ, ‘‘మీ పలువరుస చూస్తే మీ వయసు పద్దెనిమిది ఉండొచ్చు. మీ ఉంగరాల ముంగురులు చూస్తే పంతొమ్మిదనిపిస్తోంది. కాని మీ ప్రవర్తన చూస్తుంటే మాత్రం పద్నాలుగు దాటవేమో అనిపిస్తున్నది’’ అని జవాబిచ్చాడు.
ఆ మాటలు విని తబ్బిబ్బవుతూ ‘‘మీ ప్రశంసకి ధన్యవాదాలు. ఇంతకీ మీ దృష్టిలో నా వయసెంతో కచ్చితంగా చెప్పలేదు’’ అంది విలాసంగా.
‘‘ఏముంది? నేను చెప్పిన మూడంకెలూ కలుపుకుంటే నా దృష్టిలో నీ వయసెంతో తెలుస్తుంది’’ అన్నాడు కొంటెగా.
ఆ వన్నెలాడి ముఖం కందగడ్డయి పోయింది.
– ఈదుపల్లి వెంకటేశ్వరరావు

మరిన్ని వార్తలు