సాక్షి ‘ఉగాది వంటల పోటీ’కి ఇదే మా ఆహ్వానం!!

24 Mar, 2014 22:52 IST|Sakshi
సాక్షి ‘ఉగాది వంటల పోటీ’కి ఇదే మా ఆహ్వానం!!

మహిళాలోకానికి సాక్షి జయ నామ సంవత్సర శుభాకాంక్షలు. జయనామ సంవత్సర ఉగాది సందర్భంగా సాక్షి మీడియా గ్రూపు వంటల పోటీ నిర్వహిస్తోంది. షడ్రుచులతో మొదలయ్యే వసంత వేడుకలో మహిళామణులందరూ పాల్గొనే అవకాశం కల్పిస్తోంది సాక్షి. ఈ పోటీలో పాల్గొనే అభ్యర్థులు సంప్రదాయ వస్త్రధారణతో రావాలి. ఈ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వడంతోపాటు ఈ కార్యక్రమం ఉగాది పండుగ రోజు సాక్షి టెలివిజన్‌లో ప్రసారం అవుతుంది. సాక్షి దినపత్రికలో ప్రచురితమవుతుంది.
 
రిజిస్ట్రేషన్ ఇలా!... 9505555020 నంబరుకు ఫోన్ చేసి... మీ పేరు, వివరాలు ఇచ్చి ఎంట్రీని నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌కు ఆఖరు : తేదీ 26-3-2014; పోటీ జరిగే తేదీ : 28-3-2014; పోటీ జరిగే ప్రదేశం : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (సెమినార్ హాల్); సమయం  : ఉదయం పది గంటలు; ముఖ్య గమనిక : కొన్ని ఎంట్రీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. త్వరపడండి!!
 

మరిన్ని వార్తలు