లవ్ రాజు ఎవరో..!

22 May, 2016 00:05 IST|Sakshi
లవ్ రాజు ఎవరో..!

‘ఐ యామ్ ఇన్ లవ్’.  ‘చాలా సంవత్సరాల నుంచి తను పరిచయం’. ‘నాకు ఎగ్జాక్ట్ ఆపోజిట్ తను’.‘తనది కూడా నాలా హెల్పింగ్ నేచర్’.‘వంట సూపర్బ్‌గా చేస్తాడు. నాన్‌వెజ్ కూడా’. ‘రిస్క్ లేదు. పెద్దలొప్పేసుకున్నారు’. ‘ఆ యంగ్ హీరో పేరడగొద్దు తర్వాత చెబుతాను’. అని సమంత ‘సాక్షి’కి చెప్పేసింది. ఆ లవర్ బోయ్ ఎవరో మీరు చెప్పగలరా?

‘24’ సినిమాలో కాలం వెనక్కి వెళుతుంది కదా.. మీకలాంటి అవకాశం వస్తే.. మీ లైఫ్‌లో దేన్ని చెరిపేయాలనుకుంటారు?
2012లో కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాను. ఒక్కసారి వెనక్కి వెళ్లగలిగితే వాటిని ఎరేజ్ చేసేస్తాను.

ఏంటవి.. ప్రొఫెషనలా? పర్సనలా?
రెండు రకాలుగా తీసుకోకూడని డెసిషన్స్ తీసుకున్నాను.

మీలాంటి అందగత్తెలకు ప్రపోజల్స్ బాగానే వస్తాయి. లవ్‌లో పడేయడానికి చాలామంది ట్రై చేస్తుంటారు కూడా.. అప్పుడేమనిపిస్తుంది?
ఎవరైనా వచ్చి, నన్ను లవ్‌లో పడేయడానికి ట్రై చేస్తే ఆ విషయం కూడా మనసుకి ఎక్కించుకోనంత బోర్‌గా తయారైపోయాను. ఓల్డ్ అయిపోయాను. వర్క్‌లో ఇన్‌వాల్వ్ అయిపోయాను. నిజం చెప్పాలంటే ఈ మధ్య నా లైఫ్ నాకే బోరింగ్‌గా ఉంది. ఇప్పుడు పెళ్లి, పిల్లలు.. ఆ స్టేజ్‌కి వచ్చేశాను.

అయితే పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్నారన్న మాట.
అది ఇంకా తెలియదు. కానీ, పెళ్లి స్టేజ్ మాత్రం వచ్చేసింది.

ఓ యంగ్ హీరోతో లవ్‌లో ఉన్నారని టాక్.. నిజమేనా?
నిజమే. లవ్‌లో ఉన్నాను.

ఏదీ మళ్లీ చెప్పండి!
Yes, I am in love.

పెళ్లి, పిల్లలు.. ఈ లైఫ్ మీద మీ ఒపీనియన్?
కచ్చితంగా నాకు సెటిల్ అవ్వాలని ఉంది. మంచి ఫ్యామిలీ కావాలి. పిల్లలంటే ఇష్టం. హీరోయిన్‌గా చాలా సినిమాలు చేశాను. ఎంతోమంది అభిమానం పొందగలిగాను. ఆటోగ్రాఫులు, ఫొటోగ్రాఫులు అడుగుతుంటే, ‘మనమేం సాధించామని ఇలా అడుగుతున్నారు?’ అనిపిస్తుంది. అయినా నేనేం చేశానని? నా పని నేను చేశాను.. అంతకుమించి ఏమీ చేయలేదు. నన్నెందుకు అందరూ ఇష్టపడుతున్నారో తెలియదు.

సినిమాలు వదిలేస్తే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు కదా?
నేను సినిమాలు మానను. నా వయసుకి తగ్గ సినిమాలు చేస్తాను. అలాగే, నా కుటుంబ మర్యాదను కూడా కాపాడే సినిమాలే చేస్తాను. అంటే... మ్యారీడ్ స్టేటస్‌కి తగ్గ సినిమాలు చేస్తాను.

ఇప్పుడు మీ లైఫ్‌లో ఉన్న అబ్బాయి మీరు సినిమాలు చేస్తే ఒప్పుకుంటారా?
కచ్చితంగా ఒప్పుకుంటారు. తనకేం అభ్యంతరం లేదు.

మీ లైఫ్‌లో ఉన్న ఆ రియల్ హీరో ఈ మధ్య పరిచయం అయ్యారా?
కాదు.. నాకు చాలా సంవత్సరాల నుంచి తను పరిచయం.

తనలో ఉన్న క్వాలిటీస్ గురించి?
నేను బాగా అల్లరి. ఏ ఎమోషన్ అయినా నాది ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటుంది. ఆనందం వచ్చినా తట్టుకోలేను. టెన్షన్ వచ్చినా తట్టుకోలేను. ఆలోచించి మాట్లాడటం అస్సలు తెలియదు. నాకు ఎగ్జాక్ట్ ఆపోజిట్ తను. ఆలోచించి మాట్లాడటం, స్టేబుల్‌గా నిర్ణయాలు తీసుకోవడం, పేషెన్స్ అన్నీ ఉన్నాయి. నాకు కావల్సింది కూడా అదే.

ఇన్నర్‌గా మీరు మంచి అమ్మాయి.. సేవా కార్యక్రమాలు చేస్తారు. మరి.. మీక్కాబోయే భర్త డబ్బులు తగలేస్తావని అనే టైపా?
అస్సలు కాదు. నాలాగే తనది కూడా చాలా హెల్పింగ్ నేచర్. సేవా కార్యక్రమాలు చేయమని ఎంకరేజ్ చేస్తాడు. అలాంటి అబ్బాయి కాకపోతే ఇష్టపడేదాన్ని కాదేమో.

మీ మనసు దోచుకున్న ఆ అబ్బాయి ఎవరో తెలుసుకోవాలని ఉంది?
ఎవరో అడగొద్దు, జస్ట్ కొన్ని నెలల్లో చెప్పేస్తా.

అంతకుముందు లవ్‌లో పడినప్పుడు ట్విట్టర్‌లో చెప్పారు.. ఈ లవ్‌ని ఎందుకు రహస్యంగా ఉంచేశారు?
ఎవరికీ ఇబ్బంది ఉండకూడదనే బయటికి చెప్పలేదు. ఒకసారి సాఫీగా జరగలేదు. నేను హర్ట్ అయ్యాను. అందుకే ఇప్పుడు ఒకేసారి పెళ్లి గురించి ఎనౌన్స్ చేయాలనుకుంటున్నాను.

సినిమాలకు చిన్న బ్రేక్ తీసుకుంటున్నారట.. ఏం చేస్తారు?
వంట నేర్చుకోవాలనుకుంటున్నా. తింటాను తప్ప వండటం చేతకాదు. నా చుట్టూ ఉన్న అందరికీ వంట వచ్చు.

మరి.. ఆయనకు వచ్చా?
ఓ.. నా బాయ్‌ఫ్రెండ్‌కు బాగా వచ్చు. తను చేసి పెడుతుంటే తినడానికి సిగ్గుగా ఉంటుంది. అందుకే ఛాలెంజ్‌గా తీసుకుని, వంట నేర్చుకుంటాను.

ఆయన నాన్‌వెజ్ కూడా కుక్ చేస్తారా?
చేస్తారు.. నాన్‌వెజ్ చాలా బాగుంటుంది.

దాదాపు ఓపెన్‌గానే మాట్లాడేస్తారు.. ఇలా అయితే ఇబ్బందే కదా?
అవును. నేను బయటకు ఏం మాట్లాడుతున్నానో లోపల కూడా అంతే. మీడియా ముందుకు వచ్చినప్పుడు ఒకలా.. ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా ఉండలేను. ట్విట్టర్‌లో కూడా నాకనిపించింది పోస్ట్ చేసేస్తాను. దానివల్ల విమర్శల పాలయ్యాను. ఇలా ఓపెన్ బుక్‌లా ఉంటాను కాబట్టి, అసహ్యించుకునేవారినీ, అభిమానించే వారినీ సమానంగా పొందగలిగా. అయినా నో ప్రాబ్లమ్. నేను నాలానే ఉంటా.

రియల్ లైఫ్‌లో నటించరన్నమాట?
నైన్ టు సిక్స్ యాక్ట్ చేయగలుగుతాను. షూటింగ్‌కి పేకప్ చెప్పాక కూడా నటిస్తే, చివరికి నేనెవర్నో నేనే మర్చిపోతాను. నేనింతే... ఒప్పుకుంటే ఒప్పుకోండి.. లేకపోతే లేదనుకుంటాను.

ఫైనల్లీ ఓ ప్రశ్న.. మీ లవ్ మ్యారేజ్‌ని పెద్దలు అంగీకరించారా? లేకపోతే కొన్ని సినిమాల లవ్‌స్టోరీలా రిస్కులు చేయాలా?
నో రిస్క్. పెద్దవాళ్లు ఒప్పుకున్నారు.  సో.. లవ్ లైఫ్‌కి శుభం కార్డే అన్నమాట..  యస్ (నవ్వుతూ).

సమంతతో నటించిన పెళ్లి కాని తెలుగు యువ హీరోలు వీరే.  ఎనీ గెసెస్‌స్స్...!

 

మరిన్ని వార్తలు