చెప్పులు చెప్పే మర్మం ఏమిటి?

7 Apr, 2015 22:42 IST|Sakshi
చెప్పులు చెప్పే మర్మం ఏమిటి?

స్వప్నలిపి

చెప్పులే కదా అని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. కలలో కనిపించే ‘చెప్పులు’ కూడా ఎన్నో అర్థాలు చెబుతాయి. ఒకవిధంగా చెప్పాలంటే జీవితం పట్ల మన దృక్పథానికి, నమ్మక అపనమ్మకాలకు ఇవి అద్దం పడతాయి. చెప్పులు పాత పాడి, మరీ పాతబడి... నడవడానికి ఇబ్బంది పడడం అనే దృశ్యం తరచుగా కలలోకి వస్తే మీ వృత్తిలోనో, మీరు ఎంచుకున్న మార్గంలోనో ఆటంకాలు ఎదురవుతున్నట్లు.
 ఇక తరచుగా చెప్పులు మార్చడానికి కూడా ఒక అర్థం  ఉంది. మనం ఏర్పర్చుకున్న అభిప్రాయాల్లో స్థిమితం కోల్పోవడాన్ని సూచిస్తుంది. చాలామందికి ఎక్కువగా వచ్చే కల... చెప్పులు పోవడం!

ఒక దేవాలయంలోకి వెళ్లివస్తాం. బయట విడిచిన చెప్పులు కనిపించవు. ఏదో విందుకు హాజరవుతాం. బయట అందరి చెప్పులు ఉంటాయి... మన చెప్పులు కనిపించవు... ఇలా చాలా సందర్భాల్లో మన చెప్పులు మిస్ అవుతూ ఉంటాయి. ఇలా మాయం కావడం వెనుక ఏదైనా అర్థం ఉందా? ఉందనే అంటున్నాయి రకరకాల స్వప్నవిశ్లేషణలు. ముఖ్యకారణం చెప్పుకోవాల్సి వస్తే మనలోని ‘అతి జాగ్రత్త’ను, దాని గురించే చేసే పదేపదే ఆలోచన పరంపరకు ఇది అద్దం పడుతుంది. ఆత్మవిశ్వాసం కోల్పోవడం, లేని ప్రమాదాన్ని ఊహించుకునే సందర్భాల్లో కూడా ఇలాంటి కలలు వస్తుంటాయి.
 

మరిన్ని వార్తలు