బెలూన్లు స్టిచింగ్‌

18 Oct, 2019 02:22 IST|Sakshi

బామ్మ చీర అయినా నేటి భామకు అమితంగా నచ్చుతుంది ఎందుకంటే.. ఇలా బెలూన్స్‌ స్లీవ్స్‌తో చీరకట్టుకు సరికొత్త భాష్యం చెప్పవచ్చు. ఏ వేడుక అయినా  వైవిధ్యంగా వెలిగిపోవచ్చు.

చీర కట్టుకు కీలకమైన కీ రోల్‌ బ్లౌజ్‌దే. ఆరుగజాల చీర అందం సరైన ఫిటింగ్‌తో ఉండే బ్లౌజ్‌తోనే తెలుస్తుంది. ‘సింపుల్‌గా ఉన్నామా, స్టైలిష్‌గా ఉన్నామా, హుందాగా కనిపిస్తున్నామా..’ అని ఎదుటివారికి తెలిసేలా చేసేది బ్లౌజ్‌ డిజైనే. అందుకే అతివలు బ్లౌజ్‌ ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.ఏ వేడుకకైనా పట్టుచీర కట్టడం ఇప్పుడు ట్రెండ్‌లో ఉంది.

అలాగని నిన్నటి తరం వారిలా  కాకుండా పట్టుకు డిఫరెంట్‌ కాంబినేషన్‌తో స్టైలిష్‌ బ్లౌజ్‌ ధరించి చూపులను కట్టడి చేస్తున్నారు. ఇతరత్రా ఎంబ్రాయిడరీ వర్క్‌ హంగులేవీ లేకుండా కేవలం బెల్‌ స్లీవ్స్‌తో బోల్డ్‌ లుక్స్‌ని లాగేస్తున్న ఈ బ్లౌజ్‌ డిజైన్స్‌ ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి. బాలీవుడ్‌ టు టాలీవుడ్‌ ఇటు యంగ్‌ గర్ల్స్‌ నుంచి అందమైన అతివల వరకు ఈ బ్లౌజ్‌లను ధరించి గ్రేస్‌గా వెలిగిపోతున్నారు.

►సంప్రదాయ పండగలు, వివాహ వేడుకలకూ ఈ స్టైల్‌ నప్పుతుంది
►ఇండోవెస్ట్రన్‌ స్టైల్‌ ప్రత్యేక పార్టీలలోనూ గ్రేట్‌ లుక్స్‌ని కొల్లగొడుతుంది
►కంజీవరం, బెనారస్‌.. పట్టు ఏదైనా ప్లెయిన్‌ బెలూన్‌ స్లీవ్స్‌ బ్లౌజ  సరైన ఎంపిక అవుతుంది.

►బెనారస్, కంచి పట్టు చీరలు మోటిఫ్స్‌తో లుక్‌ గ్రాండ్‌గా ఉంటాయి. దీని మీదకు అదే రంగు బ్లౌజ్‌ ధరిస్తే లుక్‌లో పెద్ద మార్పు ఉండదు. అదే కాంట్రాస్ట్‌ కలర్‌ ప్లెయిన్‌ బ్లౌజ్‌కి స్లీవ్స్‌లో భిన్నమైన ప్యాటర్న్‌ తీసుకుంటే లుక్‌ స్టైలిష్‌గా కనిపిస్తుంది.
– శైలేష్‌ సింఘానియా, ఫ్యాషన్‌ డిజైనర్‌


 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా