సెకనులో ఐదోవంతు

14 Feb, 2018 01:10 IST|Sakshi

తొలి చూపులోనే ప్రేమ పుడుతుందంటారు కొందరు ప్రేమైక జీవులు. నిజానికి తొలి చూపులోనే ప్రేమలో పడటం సాధ్యమవుతుందా అని సందేహించేవారూ లేకపోలేదు. కొన్నాళ్లు కలసి మెలసి ఉంటూ ఒకరి అభిరుచులను ఒకరు తెలుసుకుంటేనే కదా ఇద్దరి మధ్య ప్రేమ పుట్టేది అని వారి వాదన.

ఇంతకీ మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నదేమంటే ఒకరిని చూడగానే వారితో ప్రేమ పుట్టడానికి సెకనులో ఐదోవంతు సమయం చాలట! ఆ కొద్ది సమయం కళ్లు కళ్లు కలుసుకుంటే చాలు, మనసులో ప్రేమ మొక్క మొలకెత్తుతుంది. అది పెనువేగంగా మహావృక్షంగా ఎదుగుతుంది. తగిన భాగస్వామి కాదగ్గవారు కనిపించగానే సెకనులో ఐదోవంతు సమయంలోనే మెదడులో ఆనందాన్ని కలిగించే డోపమైన్, ఆక్సిటోసిన్‌ హార్మోన్ల ఉత్పత్తి ఊపందుకుంటుందని, ఇక అక్కడితో ప్రేమ పుట్టుకొస్తుందని అమెరికన్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు