శునకంతో హృదయం పదిలం

26 Aug, 2019 11:02 IST|Sakshi

లండన్‌ : పెంపుడు జంతువులతో సహవాసం ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుందని పలు పరిశోధనలు వెల్లడించగా..తాజాగా కుక్కను పెంచుకుంటే గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చని నిపుణులు పేర్కొన్నారు. శునకంతో చెలిమి చేస్తే దానితో పాటు పరిగెత్తడం, పచ్చిక బయళ్లలో విహరించడం చేస్తారని ఇది గుండెకు మేలు చేకూరుస్తుందని చెబుతున్నారు. కుక్క యజమానులు మంచి ఆహారం తీసుకుంటారని వీరికి డయాబెటిస్‌ రిస్క్‌ కూడా తక్కువగా ఉంటుందని తాజా అథ్యయనం పేర్కొంది. చురుకైన జీవనశైలి, మంచి ఆహారంతో హృదయ ఆరోగ్యం పదిలంగా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. 24 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయసున్న దాదాపు 2000 మందిపై జరిపిన పరిశోధనలో కుక్క సహా పెంపుడు జంతువులతో కాలక్షేపం చేసేవారిలో ఇతరుల కంటే రక్తపోటు, మధుమేహం, కొవ్వు శాతం తక్కువగా ఉండి గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్టు వెల్లడైందని సెయింట్‌యాన్స్‌ యూనివర్సిటీ ఆస్పత్రి చేపట్టిన అథ్యయనం తెలిపింది.పెంపుడు జంతువులు లేని వారితో పోలిస్తే వీరికి మంచి కొలెస్ర్టాల్‌ అధికంగా ఉండటంతో పాటు మధుమేహం లేకపోవడాన్ని గుర్తించామని అథ్యయనానికి నేతృత్వం వహించిన రచయిత అండ్రియా మగెరి చెప్పారు. పెంపుడు జంతువులు కలిగిన వారిలో ఎక్కువగా శారీరక కదలికలు, మెరుగైన ఆహారం, సరైన స్ధాయిలో మధుమేహం ఉండటం కనిపిస్తోందని వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు