సెల్ఫ్ చెక్

5 Mar, 2014 00:57 IST|Sakshi
సెల్ఫ్ చెక్

ముప్ఫై ఏళ్లు దాటాయంటే మహిళ ఆరోగ్యంలో రకరకాల మార్పులు వస్తుంటాయి. పెరుగుతున్న బాధ్యతల కారణంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే వయసు కూడా అదే కావడంతో శరీరం పట్టుతప్పడం మొదలవుతుంది.

ముప్ఫై నుంచి నలభై ఏళ్ల వయసులో ఆరోగ్యం, ఫిట్‌నెస్ విషయాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే అనారోగ్యాలను తెచ్చిపెట్టుకున్నవారవుతారు. ఇంతకీ మీరెలా ఉన్నారో తెలుసుకోండి.
 

1. 30 ఏళ్ల వయసు దాటిన తర్వాత బరువు పెరగడం గమనించి ఆ సమస్యను అధిగమించడానికి వాకింగ్, యోగవంటివి చేస్తున్నారు.
     ఎ. అవును     బి. కాదు
 2.    అన్ని వయసుల్లోనూ ఆహారం ఒకేలా తీసుకోవడం మంచిది కాదు కాబట్టి బీపీ, షుగర్‌లకు చెక్ పెట్టే ఆహారాన్ని మాత్రమే తింటున్నారు. అప్పుడప్పుడు మసాలాతో నిండిన ఆహారం తిన్నా వెంటనే దానికి విరుగుడుగా పళ్లు వంటివి తీసుకుంటారు.
     ఎ. అవును     బి. కాదు
 3.చర్మంలో తేమ తగ్గకుండా ఉండడానికి సౌందర్య పోషకాలతో పాటు దానికి తగ్గట్లు ఆహారపుటలవాట్లను కూడా మార్చుకుంటారు. రసాయనిక ఉత్పత్తులను వాడకుండా వీలైనంతవరకూ ప్రకృతిసిద్ధమైనవాటినే ఇష్టపడతారు.
     ఎ. అవును     బి. కాదు
 4.    తల్లితండ్రులు బీపీ, షుగర్ రోగులైనప్ప టికీ, మీకు 30 ఏళ్లు దాటినా తరచూ వైద్య పరీక్షలు చేయించుకోరు. ఒకవేళ అలాంటి జబ్బులొస్తే ‘వంశపారంపర్యంగా వచ్చినదానికి మనమేం చేస్తామని’ డిప్రెషన్‌లో మునిగిపోయి, ఆరోగ్యాన్ని మరింత నిర్లక్ష్యం చేస్తారు.
     ఎ. కాదు     బి. అవును
 5.    కుటుంబ బాధ్యతలు పెరిగే వయసు కాబట్టి మానసికంగా ఒత్తిడికి గురి కాకుండా రోజులో కొంత సమయమైనా ప్రశాంతంగా గడపడానికి కావాల్సిన ఏర్పాటు చేసుకుంటారు.
     ఎ. అవును     బి. కాదు
 మీ జవాబుల్లో ‘ఎ’లు ఎక్కువగా వస్తే మీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉన్నట్టు. లేకపోతే కొత్త జబ్బులు కొనితెచ్చుకుంటున్నట్లు.
 
 

మరిన్ని వార్తలు