సెల్ఫ్ చెక్

8 May, 2015 00:05 IST|Sakshi
సెల్ఫ్ చెక్

సమ్మర్ ట్రిప్  సరిగా ప్లాన్ చేస్తున్నారా?
 
పిల్లలకు పరీక్షలయ్యాయి. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్న ప్రదేశాలను చూడడానికి ఇదే మంచి సమయం. ఇబ్బందులను ఎదుర్కోకుండా ట్రిప్‌ను ఆద్యంతం ఆస్వాదించాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి?- అన్న విషయంలో మీకు ఉన్న అవగాహనను ఒకసారి చెక్ చేసుకోండి.

 1.    మీతోపాటు మీ పిల్లలు, అమ్మానాన్నలు... ఇలా ఇంటిల్లిపాదీ కలిసే వెళ్లే ప్రదేశాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు.
     అవును     కాదు
 
2.    ఇంట్లో అందరికీ నచ్చే ప్రదేశం దాదాపుగా ఏ ఒక్కటీ ఉండదు. కాబట్టి ఆ ట్రిప్‌లో పిల్లలు ఎంజాయ్ చేయడానికి సాంక్చురీ, మీకు నచ్చే మాన్యుమెంట్స్‌తోపాటు మీ అమ్మానాన్నలకు నచ్చే ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం... ఉండేలా ప్లాన్ చేస్తారు.
     అవును     కాదు

3.    చారిత్రక కట్టడాల వంటి పర్యాటక ప్రదేశాల్లో పర్యటించడానికి ఉదయం లేదా సాయంత్రం మంచిదని(ఎండ తక్కువగా ఉండే సమయం) మీకు తెలుసు.
     అవును     కాదు
 
4.    ఆధ్యాత్మిక ప్రదేశాల్లో పర్యటించే ముందే అక్కడి దర్శనానికి అనుమతించే సమయం, పూజలు, సేవల వివరాలను తెలుసుకుని ఆ మేరకు ప్రయాణాన్ని ప్లాన్ చేస్తారు.
     అవును     కాదు
 
5.    వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల వంటి ప్రదేశాల్లో పర్యటించే ముందుగా అక్కడ ఏ జంతువులు ఉంటాయి, వాటి ప్రాముఖ్యత వంటి వివరాలు తెలుసుకుని పిల్లలకు ఆసక్తి కలిగేటట్లు వాటిని చెబుతారు.
     అవును     కాదు
 
6.    హిల్‌స్టేషన్లకు వెళ్లేటప్పుడు అక్కడ నడవటానికి అనువుగా ఉండే పాదరక్షలను తప్పకుండా జాగ్రత్త తీసుకుంటారు.
     అవును     కాదు
 
7.    విలువైన ఆభరణాలు, యాక్సెసరీస్ వంటివి ధరించడం వల్ల వెళ్లిన చోట ఆ ప్రదేశాన్ని ఎంజాయ్ చేయడం కంటే మన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం మీదే దృష్టి పెట్టాల్సి వస్తుంది - కాబట్టి ధర తక్కువైన సింపుల్ యాక్సెసరీస్ మాత్రమే ధరిస్తారు.
     అవును     కాదు

 పైవాటిలో ‘అవును’లు ఎక్కువ వస్తే మీకు సమ్మర్ ట్రిప్‌పై సరైన ప్లానింగ్ వుందని చెప్పవచ్చు.
 
 

మరిన్ని వార్తలు