అజ్ఞాతవాసి ‘తల్లిపాల’ పాట

16 Nov, 2018 00:12 IST|Sakshi

పట్రీషా విషయం నవంబర్‌ ఆరవ తేదీనాటి సంగతి. దీనికి సామ్యం లేకపోయినా సందర్భం ఉన్న ఒక చిన్న విషయం.. ఈ మూడు రోజులుగా మన దగ్గరా సోషల్‌మీడియా ముఖ్యంగా వాట్సప్‌లో వైరల్‌ అయింది. మొన్నటి దాకా వైరల్‌ అయిన రాజమండ్రి కోకిల బేబీ లాంటి గాయనికి సంబంధించిందే. ఆమె పేరు, ఊరు వంటి వివరాలు ఏమీ తెలియవు. కాని పట్రీషాలాగా తల్లి పాలు ఎంత శ్రేష్టమో.. అవి బిడ్డకు ఎంత అవసరమో .. ‘ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ’బాణీలో పాట కట్టి పాడుతోంది. ఇలా...‘‘అమ్మ పాలల్లోన అమృతం ఉంది..రోగాలనరికట్టు శక్తి దాగుందీ...ఆ పాలల్లో ఉన్న పసుపుదనమంతా పసిపాపలకు ఎంతో ఆరోగ్యమంటా.. ముందుగా వచ్చిన ముర్రుపాలల్లోనే పోషకాలు అధికముగా పొదిగి ఉన్నాయి.

పాపాయి పుట్టినా అరగంటలోపే.. అమ్మపాలను మనము తాగించవచ్చు..కాచి చల్లార్చే అవసరము లేదు..తగిన వేడిని కలిగి ఉంటాయి చూడు.. ఏ పటిక బెల్లమూ అవసరము లేదు...కావల్సినంతరుచి పాలల్లో కలదు. సులువుగా జీర్ణమై శుభ్రముగా ఉండు..శిశువులా మరణాలు తగ్గించవచ్చు..బిడ్డ నోటికి మంచి వ్యాయామం అండీ...రొమ్ము క్యాన్సర్‌ మీ దరికైనా రాదు.. ఏ వేళలోనైనా ఇవ్వచ్చునండీ.. తిత్తులు, పీకలు అలవర్చకండీ..మీ అందం అధికమై తేజస్సు పెరుగు.. తప్పకుండా పాలనివ్వమ్మ చెల్లీ.. అమ్మ పాలల్లోన అమృతముంది.. రోగాలనరికట్టు శక్తి దాగుందీ... !! 

మరిన్ని వార్తలు