మా ఆవిడ తరచు పుట్టింటికి వెళుతుంటుంది...

19 Aug, 2014 22:34 IST|Sakshi
మా ఆవిడ తరచు పుట్టింటికి వెళుతుంటుంది...

మగోడు
 
మా ఆవిడ చీటికి మాటికి పుట్టింటికి వెళ్లేది. ‘నా భార్యను పుట్టింటికి వెళ్లకూడదు’ అని చెప్పేంత చెడ్డవాడిని కాదు. అయితే మా ఆవిడ ఒక్కసారి పుట్టింటికి వెళితే ఏదో ఒక సాకు చెబుతూ రోజుల కొద్ద్దీ అక్కడే ఉండేది.
 
నేను  మా మేనమామ కూతురును పెళ్లి చేసుకున్నాను. మామయ్య వాళ్లది మా పక్క ఊరే. ఇదే నా పాలిటి శాపం అయింది. మా ఆవిడ చీటికి మాటికి పుట్టింటికి వెళ్లేది. ‘పుట్టింటికి వెళ్లకూడదు’ అని చెప్పేంత చెడ్డవాడిని కాదు నేను. అయితే మా ఆవిడ ఒక్కసారి పుట్టింటికి వెళితే  ఏదో ఒక సాకు చెబుతూ రోజుల కొద్ది అక్కడే ఉండేది.
 
నేను ఆఫీసు నుంచి బాగా అలిసిపోయి ఇంటికి  వచ్చే వాడిని. మరో వైపు ఆకలి దంచేసేది. నీరసం అవరించేది. వంట చేసుకునే ఓపిక ఉండేది కాదు.  దీంతో ఏవేవో చిరు తిళ్లు తిని కడుపు నింపుకునేవాడిని. ఇలా తరచుగా చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బ తినడం మొదలైంది.
 ‘‘భార్య అంటే వంట చేయడానికేనా? నువ్వు చేసుకొని తినవచ్చు కదా!’’ అని సందేహం మీలో ఎవరికైనా రావచ్చు.
 దీనికి సంబంధించి కూడా నేను కొంత వివరణ ఇవ్వదలిచాను.
 నాకు వంట వచ్చు. చేయడానికి ఎలాంటి నామోషీ లేదు. అయితే ఆఫీసుకు నేను వెళ్లే టైమ్ తప్ప, వచ్చే టైమ్ తెలియదు. ఒక్కోసారి రాత్రి పది కావచ్చు, పదకొండు కావచ్చు. అందుకే వంట చేసుకోవడానికి ఇబ్బంది పడేవాడిని.
 ఒకసారి మా ఆవిడను తీసుకురావడానికి  వెళితే-
 ‘‘అప్పుడే వచ్చావా?!  రెండు రోజులు ఉండి వస్తుందిలే...’’ అనేవాడు మామయ్య.
 నేను మొహమాటానికి ‘‘అలాగే మామయ్య’’ అంటూ  గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చేవాడిని. ఇలా ఎన్నోసార్లు జరిగింది. జరుగుతుంది.
 నా బాధ మాత్రం మింగలేక కక్కలేక అన్నట్లుగా ఉంది!
 
- జీఆర్, (ఊరి పేరు రాయలేదు)
 

మరిన్ని వార్తలు