నైట్‌క్రీమ్స్‌తో మెరిసే చర్మం

23 Sep, 2018 23:43 IST|Sakshi

చర్మం మృదువుగా అందంగా తయారవడానికి మార్కెట్లో లభించే క్రీములను వాడుతుంటాం. కాని ఇంట్లోనే సులభంగా బ్యూటీ క్రీములను తయారుచేసుకోవచ్చు. వీటిని రాత్రిపూట పడుకునేముందు వాడితే చర్మం సహజమైన కాంతితో మెరిసిపోతుంది.

రోజ్‌వాటర్‌ క్రీమ్‌...
కావలసినవి: పావుకప్పు రోజ్‌వాటర్, అరకప్పు బాదాం నూనె, అర టీ స్పూన్‌ సోడియమ్‌ బెంజోయేట్, 30 గ్రాములు వైట్‌ వాక్స్‌
వ్యాక్స్‌ను కరిగించి అందులో బాదాం నూనెను, రోజ్‌ వాటర్‌ కలపాలి. దీనికి బెంజోయేట్‌ చేర్చి ఒకరోజు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఈ మిశ్రమాన్ని పొడి చర్మం వున్నవారు రాత్రిపూట రాసుకొని ఉదయాన్నే కడిగేయాలి. చర్మం మృదువుగా తయారవుతుంది.
 జిడ్డు చర్మం గల వారు ఆలివ్‌ ఆయిల్‌ని మసాజ్‌ చేసినట్టుగా రాసుకోవాలి. క్రమం తప్పకుండా రాత్రిపూట ఇలా చే స్తూ ఉంటే చర్మం నునుపుగా, కాంతివంతంగా తయారవుతుంది.

మరిన్ని వార్తలు