తప్పు మాదిరా రాఘవా

1 Jun, 2020 01:06 IST|Sakshi

సాహిత్య మరమరాలు 

బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్‌కు కుడివైపున గుబ్బితోటదప్ప సత్రం ఉంది. అక్కడ ఒకప్పుడు కన్నడ, తెలుగు నాటకాలు ప్రదర్శింపబడేవి. ఇది డెబ్భై ఏళ్ల నాటి మాట. ఒకసారి పి.వి.రాజమన్నారు ‘తప్పెవరిది?’ నాటకం వేస్తున్నారు. వేశ్యావృత్తికి సంబంధించిన కథావస్తువు. బళ్లారి రాఘవ నాయకపాత్ర. పుట్టుకతో ఎవరూ వేశ్యలు కారు. సమాజమే వేశ్యల్ని తమ కోరికలు తీర్చుకునేందుకు తయారు చేస్తుంది. తప్పెవరిది? తప్పెవరిది? అంటూ గుండెలు బాదుకుంటాడు నాటకం చివర్లో నాయకుడు. పదే పదే గుండెలు బాదుకున్నా తెర వాలదు. అప్పుడు నేల మీద కూర్చున్న కన్నడ నాటకకారుడు టి.పి.కైలాసం ‘‘తప్పు నీది కాదురా రాఘవా, దుడ్డు ఇచ్చిన మాదిరా’’ అంటూ తల కొట్టుకుంటాడు. ఆ మాటలు అన్నది తన మిత్రుడైన కైలాసమే అని గుర్తించి గబగబా తెరవెనక్కి పరుగెత్తుతాడు రాఘవ. - శివప్రియ 

మరిన్ని వార్తలు