సూక్ష్మజీవులను నింపుకుంటే వ్యాధులు దూరం!

7 Jun, 2019 01:48 IST|Sakshi

పరి పరిశోధన

మన జీర్ణవ్యవస్థలో ఉండే సూక్ష్మజీవులకు, ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని శాస్త్రవేత్తలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన బ్రాబ్రహమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు తాజాగా ఓ  ప్రయోగం చేపట్టారు. దీని ప్రకారం.. జీర్ణవ్యవస్థకు సంబంధించిన బ్యాక్టీరియాను కృత్రిమ పద్ధతుల ద్వారా చేర్చడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ పునరుజ్జీవం పొందుతుందని.. తద్వారా వ్యాధులను మరింత సమర్థంగా ఎదుర్కోవడం వీలవుతుందని ఈ పరిశోధన చెబుతోంది. తక్కువ వయసున్న ఎలుకల వ్యర్థాల నుంచి సేకరించిన బ్యాక్టీరియాను వయసు మీదపడిన ఎలుకల్లోకి జొప్పించినప్పుడు వాటి రోగ నిరోధక వ్యవస్థ పనితీరులో గణనీయమైన మార్పు కనిపించిందని ఈ పరిశోధనలకు నేతత్వం వహించిన శాస్త్రవేత్త మరిసా స్టెబెగ్‌ తెలిపారు.

పేవుల్లోని బ్యాక్టీరియాకు రోగనిరోధక వ్యవస్థకు మధ్య నిత్యం సమాచార వినిమయం జరుగుతూంటుందని వయసు పెరిగే కొద్దీ రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుందని మరిసా తెలిపారు. ఎలుకల్లో బాగా పనిచేసిన ఈ పద్ధతి మనుషుల్లోనూ పనిచేస్తుందా? లేదా? అన్నది ఇంకా నిర్ధారించుకోవాల్సి ఉందని చెప్పారు. అయితే ఇప్పటికే జరిగిన కొన్ని పరిశోధనలు పేవుల్లోని బ్యాక్టీరియాకు, వయసుతోపాటు వచ్చే సమస్యలకు మధ్య సంబంధం ఉన్నట్లు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ తాజా పరిశోధనకు ప్రాముఖ్యత ఏర్పడింది. పరిశోధన వివరాలు నేచర్‌ కమ్యూనికేషన్స్‌ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా