పట్టుచీరకు బ్లౌజ్ బొట్టు

5 Nov, 2015 23:34 IST|Sakshi
పట్టుచీరకు బ్లౌజ్ బొట్టు

పట్టు చీర కడితే పండగ వచ్చేసినట్టే. పండగ కళ రావాలంటే పట్టు చీర కట్టాల్సిందే. దీపాల వెలుగుల్లో మహాలక్ష్ముల్లా మెరిసిపోవడానికి పట్టు చీరలు రెపరెపలాడాల్సిందే! వరుసగా పెళ్లిళ్లు కూడా రావడంతో పట్టు చీరలు సందడిచేసే సమయం ఇదే! మీదైన ప్రత్యేకత వేడుకలో కనిపించాలంటే బ్లౌజ్ మీద దృష్టి పెట్టాలి. చీరకు తగిన బ్లౌజ్ కాదు, చీరను బ్రైట్ చేసే బ్లౌజ్‌ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. నుదుటికి బొట్టులా చీరకు బ్లౌజ్ ఓ తరగని అందం.
 
 జరీ అంచుల మెరుపులు పట్టు చీరకు ఎంతో అందాన్ని తీసుకువస్తాయి. జరీ లైన్స్, బార్డర్స్, మోటిఫ్స్.. వీటిలోనే పట్టు చీరలలో ఎన్నో రకాలు ఉన్నాయి. అలాగే బ్లౌజ్ డిజైన్స్‌లో ఎన్నో వెరైటీస్ ఉన్నాయి.
 వాటిలో కొన్ని ఇక్కడ ఇస్తున్నాం.
 - ఎన్ .ఆర్
 
భిన్నమైన రంగులు

పట్టు చీర కొన్నాక అందులోనూ బ్లౌజ్‌కి సరిపడా క్లాత్ ఉంటుంది. దీంతోనే బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటారు. చీర రంగుకు పూర్తి భిన్నమైన రంగు బ్లౌజ్‌లు, విభిన్న మోడళ్లలో డిజైన్ చేయించుకుంటే సందర్భానుసారం స్టైల్‌గా మెరిసిపోవచ్చు.
 
ఎంబ్రాయిడరీ కీలకం
జరీ, కుందన్స్, స్టోన్స్‌ను ఉపయోగించే చేసే మగ్గం వర్క్ బ్లౌజ్‌లు చూపుతిప్పుకోనివ్వకుండా డిజైన్ చేస్తున్నారు. వీటి కన్నా కేవలం పట్టు క్లాత్‌ను ఉపయోగించి మాత్రమే డిజైన్ చేసిన బ్లౌజ్‌లు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. పెళ్లిళ్లకు వాడే బ్లౌజ్‌లలో ఎక్కువ మగ్గం వర్క్ చూస్తుంటాం. కానీ ప్రముఖ డిజైనర్స్ మాత్రం ఎంబ్రాయిడరీని ఉపయోగించకుండా పట్టు క్లాత్‌తోనే మోడ్రన్ డిజైన్స్ సృష్టిస్తున్నారు.
 
ఫ్రంట్అండ్ బ్యాక్ నెక్
 ఎప్పుడూ రౌండ్, స్క్యేర్ టైప్ కాకుండా బోట్ నెక్, హై నెక్, లెహంగా జాకెట్ స్టైల్.. ఇలా భిన్నమైన డిజైన్లు ఈ బ్లౌజ్‌లకు ఉపయోగించవచ్చు. ఈ డిజైన్ బ్లౌజులు ధరించడం వల్ల ఆధునికంగా కనిపిస్తారు. బాక్ నెక్స్‌లో క్రాస్, బ్రాడ్.. డిజైన్స్ ఈ కాలానికి తగ్గట్టుగా బాగా నప్పుతున్నాయి.
 
స్లీవ్స్... స్లీవ్‌లెస్...

పట్టు చీరల మీదకు ఒకే తరహా స్లీవ్స్ కాకుండా బుట్టచేతులు, లాంగ్, త్రీ బై ఫోర్త్.. ప్రస్తుతం బాగా వాడుకలో ఉన్నాయి. ముఖ్యంగా లాంగ్ స్లీవ్స్ ఇప్పటి ట్రెండ్‌లో ముందున్నాయి. చీర అంచు అంతా ఇంకాస్త ఎక్కువగానే బ్లౌజ్ స్లీవ్స్ డిజైన్ చేయడం నిండైన వెలుగునిస్తుంది’ అంటారు ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైన్ గౌరంగ్‌షా, మనీషా మల్హోత్రాలు.
 

మరిన్ని వార్తలు