శైవాగమంలో గణపతి... మరి వైష్ణవంలో..?

3 Sep, 2017 00:19 IST|Sakshi
శైవాగమంలో గణపతి... మరి వైష్ణవంలో..?

ఆగమం శైవసంప్రదాయంలో తొలిపూజ అందుకునేది వినాయకుడైతే, శ్రీవైష్ణవ ఆగమాలు విష్వక్సేనునికి అగ్రపూజ చేస్తాయి. ‘విశ్వ’ అంటే సకలలోకాలను, ‘సేనుడు’ అంటే నడిపించేవాడనీ అర్థం. విష్వక్సేనుడు విష్ణు గణాలకు అధిపతి. విష్ణు సైన్యాధిపతియైన విష్వక్సేనుని ఆశ్రయించిన వారికి ఎన్ని అడ్డంకులనైనా తొలగిస్తాడు. నాలుగు భుజాలతో శంఖు, చక్ర, గదలను ధరించి నాలుగువేళ్ళను మడిచి, చూపుడు వేలును పైకి చూపిస్తోన్న ముద్రతో దర్శనమిస్తుంటాడు విష్వక్సేనుడు. కొన్ని సందర్భాలలో గదకు బదులుగా దండాయుధంతో కనబడుతుంటాడు. ఆ స్వామిని ఆశ్రయిస్తే చాలు, సమస్త దోషాలను హరించి, భక్తులలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు.

ఎవరైతే విష్వక్సేనుని ఆరాధిస్తారో, ధ్యానిస్తారో, వారికి ఎలాంటి విఘ్నాలు, ఆపదలు, కష్టాలు కలుగవని వైఖానస ఆగమం చెబుతోంది. విష్వక్సేనునికి సూత్రవతీ, జయ అనేవారు భార్యలు. మనం చేతికి ధరించే రక్షాసూత్రానికి అధి దేవతే సూత్రవతి. శ్రీవైష్ణవాగమాలు విష్వక్సేనుని దర్భకూర్పుగా ఆరాధిస్తాయి. శైవంలో పసుపు గణపతిని పూజిస్తే, వైష్ణవంలో తమలపాకుపై వక్కను ఉంచి,  విష్వక్సేనునిగా భావిస్తారు. అందుకే వక్కలు లేని ఆకులు నిరర్థకం, నిష్ఫలం అంటారు.

మరిన్ని వార్తలు