స్కిన్ టైట్‌నింగ్

20 Oct, 2016 22:40 IST|Sakshi
స్కిన్ టైట్‌నింగ్

బ్యూటిప్స్


రెండు లేదా మూడు క్యాబేజీ ఆకులు, రెండు టీ స్పూన్ల బియ్యప్పిండి, గుడ్డు తెల్ల సొన తీసుకుని అన్నింటినీ మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. అవసరమైతే నీటిని కలుపుకోవచ్చు. పొడి చర్మం వాళ్ళు మూడు చుక్కలు ఆలివ్ ఆయిల్ లేదా బాదం ఆయిల్‌ను కలుపుకోవచ్చు. ఈ పేస్ట్‌ని ముఖమంతా అప్లై చేసుకోవాలి. మసాజ్ చేయకూడదు. ప్యాక్ టైట్ అయ్యేంతవరకూ లేదా ప్యాక్ పొడిబారేంత వరకూ ఉంచుకుని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికోసారి ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం ముడతలు పడకుండా, వదులు అవకుండా ఉంటుంది.

 

ఇంట్లోనే బ్లీచింగ్
తయారి: బాగా మరిగిన పాలు చల్లారిన తర్వాత పై మీగడను ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో చిటికెడు పసుపు, కొన్ని చుక్కలు నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. 

ముందుగా ముఖాన్ని నీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి. తయారుచేసుకున్న బ్లీచ్‌ను ముఖమంతా అప్లై చేసుకోవాలి. వేలితో ముఖంపై నెమ్మదిగా వలయాకారంలో రబ్ చేయాలి. పది నిముషాలపాటు ఉంచుకుని కడిగేసుకోవాలి. తేడా మీరే గమనిస్తారు. మార్కెట్‌లో లభించే బ్లీచ్ కంటే బాగా పనిచేస్తుంది.

మరిన్ని వార్తలు