ఎస్‌.ఎల్‌.భైరప్ప

26 Mar, 2018 01:30 IST|Sakshi
ఎస్‌.ఎల్‌.భైరప్ప

గ్రేట్‌ రైటర్‌
భారతీయ ఆధునిక నవలా రచయితల్లో అగ్రశ్రేణిలో ఉండగలిగేవారిలో సంతేశివర లింగన్నయ్య భైరప్ప ఒకరు. ఆయన 1934లో కర్ణాటకలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లినీ సోదరులనూ కోల్పోయారు. మధ్యలోనే చదువు వదిలేసి, రైల్వే కూలీగా పనిచేశారు. కొన్నాళ్లు సాధువులతో కలిసి తిరిగారు. మళ్లీ చదువు వైపు మరలి, అంచెలుగా ఎదిగి, తత్వశాస్త్ర అధ్యాపకుడిగా స్థిరపడ్డారు.

మహాభారత కథను వాస్తవిక సామాజిక దృక్పథంతో పునఃచిత్రించిన ‘పర్వ’ అనితరసాధ్యమైన కృషి. ఈ ఒక్క నవలే భైరప్పను ఎక్కడో నిలబెడుతుంది. అలాంటిది మరెన్ని నవలలు! వంశవృక్ష, గృహభంగ, దాటు, ఆవరణ లాంటి నవలలతో ఒక సరికొత్త పంథాను ఆయన ఆవిష్కరించారు. ఒక తీవ్రమైన మథనం, ఒక గొప్ప పరిశోధన, ఒక దివ్యమైన సమన్వయం ఆయన నవలల్లో కనబడుతుంది. ‘వంశవృక్ష’, ‘నాయి నెరళు’, ‘తబ్బలియు నినాద మగనె’, ‘మతదాన’ నవలలు కన్నడ చిత్రాలుగానూ, ‘గృహభంగ’, ‘దాటు’ టీవీ ధారావాహికలుగానూ రూపొందాయి. వంశవృక్ష తెలుగులో బాపు దర్శకత్వంలో ‘వంశవృక్షం’ సినిమాగా వచ్చింది.
 

మరిన్ని వార్తలు