దెయ్యాలు నిజంగానే ఉన్నాయా?

22 Jun, 2018 16:20 IST|Sakshi

సాక్షి, వెబ్‌ డెస్క్‌ : మీరు కళ్లు తెరచి పడుకుంటున్నారా?, నిద్రిస్తున్న సమయంలో ఏవైనా వింత శబ్దాలు మీకు వినిపిస్తున్నాయా?. సహజంగా ఒకసారి, రెండుసార్లు ఇలాంటి సంఘటనలు జరిగితే పట్టించుకోకుండా వదిలేస్తాం. అదే పదేపదే శబ్దాలు వినిపిస్తే మాత్రం అనుమానం(ఏదో ఉందని) మొదలవుతుంది. ఏదో గుర్తించలేని  అదృశ్య శక్తి మనల్ని వెంబడిస్తుందని భావిస్తాం.

ఒక్కోసారి పడుకున్న చోటును ఎటూ కదలలేకపోతాం. దీంతో మనల్ని ఎవరో వెంటాడుతున్నారన్న భయం పెరిగిపోతుంది. అప్పటినుంచి క్షణక్షణం నరకం అనుభవిస్తాం. చీకటి పడుతుంటుంది. ఇంటికి వెళ్లాలంటే గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి. రాత్రికి మళ్లీ ఏం జరుగుతోందనని హడలెత్తిపోతుంటాం.

ఇలాంటి అనుభూతులన్నీ దెయ్యాలు, భూతాల వల్ల కాదని సైకాలజీ ప్రొఫెసర్‌ ఎలైస్‌ గ్రెగరీ తేల్చేశారు. గోల్డ్‌స్మిత్‌ విశ్వవిద్యాలయంలో సైకాలజీ విభాగంలో ఆయన పని చేస్తున్నారు. హఠాత్తుగా నిద్రలో నుంచి లేచి ఇంట్లో ఏదో ఉన్నట్లు భావించే వారు అధికంగా బాగా పొద్దుపోయిన తర్వాత నిద్రిస్తున్నారని చెప్పారు. ఇదే వారిని మానసిక ప్రశాంత నుంచి దూరం చేస్తోందని వెల్లడించారు.

నిద్ర పక్షవాతం
నిద్ర మొత్తం 3 స్టేజ్‌లలో ఉంటుందని గ్రేగ్‌ చెప్పారు. మనుషులు మొదట మెల్లగా నిద్రలోకి జారుకుంటారని, సమయం గడిచే కొద్దీ గాఢ నిద్రలోకి వెళ్తారని, ఆ తర్వాత రకరకాల కలల్లోకి వెళ్తామని గ్రెగరీ పేర్కొన్నారు. ఈ దశలో కలలోని పనులను మనం నిజంగానే చేస్తున్నట్లు భావిస్తామని, బెడ్‌పై కాళ్లు, చేతులు, ముఖ కవళికలు కలకు అనుకూలంగా మారతాయని చెప్పారు. ఈ స్థితిని నిద్ర పక్షవాతం అంటారని చెప్పారు.

బాగా పొద్దుపోయిన తర్వాత నిద్రించేవారిలో ఈ మూడు స్టేజ్‌లు పూర్తికావని దాంతో వారు పగటిపూట అవిశ్రాంతిగా ఫీల్‌ అవుతారని తెలిపారు. ఇదే పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే మెల్కొన్న తర్వాత కూడా కదలలేకపోవడం, ఏదో జరుగుతున్నట్లు ఫీల్‌ అవ్వడం వంటివి జరుగుతాయని వివరించారు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు