‘స్లీపింగ్‌ బ్యూటీ డైట్‌’తో ఆరోగ్యానికి ముప్పు

7 Feb, 2018 00:16 IST|Sakshi
అదనపు నిద్ర

డైట్‌  ట్రెండ్‌ 

ఇటీవలి కాలంలో పలు దేశాల్లోని మహిళలు సన్నబడటానికి ‘స్లీపింగ్‌ బ్యూటీ డైట్‌’ పాటిస్తున్నారు. మెలకువగా ఉన్నప్పుడు ఎక్కువగా తినేసి బరువు పెరిగిపోతామనే బెంగతో గంటలకు గంటలు నిద్రలోనే గడిపేస్తున్నారు. కొందరైతే అదనపు నిద్ర కోసం ఏకంగా నిద్రమాత్రలను కూడా ఆశ్రయిస్తున్నారు.

బరువు తగ్గే ప్రయత్నంలో అతినిద్రను ఆశ్రయించడం వల్ల ఇతరేతర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని కాలిఫోర్నియా వర్సిటీలోని స్లీప్‌ డిజార్డర్స్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అలన్‌ అవిడాన్‌ హెచ్చరిస్తున్నారు. ‘స్లీపింగ్‌ బ్యూటీ డైట్‌’ వంటి పద్ధతుల వల్ల పోషకాహార లోపాలతో పాటు శరీరంలోని జీవక్రియల్లోనూ తేడాలు ఏర్పడతాయని ఆయన చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు