స్వల్ప వ్యాయామంతో సుఖ ప్రసవం నిజమే!

20 Mar, 2018 00:52 IST|Sakshi

న్యూస్‌ 

సాధారణ స్థితిలో ఉన్నప్పుడు వ్యాయామం చేయడంపై ఎవరికీ ఎలాంటి అనుమానాలూ ఉండవు గాని, గర్భంతో ఉన్నప్పుడు వ్యాయామం చేయవచ్చా, లేదా అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. అయితే గర్భిణులుగా ఉన్నప్పుడు కూడా మహిళలు నిరభ్యంతరంగా తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చని, వ్యాయామం చేయకుండా ఉండటం కంటే వ్యాయామం చేస్తూ ఉంటేనే వారికి మంచిదని మాడ్రిడ్‌ టెక్నికల్‌ యూనివర్సిటీ నిపుణులు ఒక తాజా అధ్యయనంలో తేల్చారు. దాదాపు 500 మందికి పైగా గర్భిణులపై అధ్యయనం జరిపి ఈ విషయాన్ని నిర్థారించారు.

గర్భిణులుగా ఉన్నప్పుడు క్రమం తప్పకుండా వ్యాయామం చేసినట్లయితే, ప్రసవ సమయంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని వారు చెబుతున్నారు. గర్భిణులుగా ఉన్నప్పుడు వ్యాయామం చేస్తూ ఉన్నట్లయితే, ప్రసవ సమయంలో నొప్పుల తీవ్రత చాలా వరకు తక్కువగా ఉంటుందని, సుఖప్రసవం జరుగుతుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ రూబెన్‌ బరాకత్‌ చెబుతున్నారు.

మరిన్ని వార్తలు