స్మార్ట్‌ఫోనే రిమోట్ కంట్రోల్...

11 Jun, 2014 23:50 IST|Sakshi
స్మార్ట్‌ఫోనే రిమోట్ కంట్రోల్...

స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే దాన్ని మౌస్‌లా, ట్రాక్‌పాడ్‌లా ఉపయోగించుకోవచ్చునని మనకు తెలుసు. కానీ ఇంట్లో ఉన్న అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాల (ఇన్ఫ్రారెడ్ కమాండ్లతో పనిచేసేవి)ను నియంత్రించే రిమోట్‌లా కూడా మార్చుకోవచ్చునని అంటోంది స్మార్ట్ ఐఆర్ రిమోట్ కంపెనీ.

ఎనీమోట్ పేరుతో ఈ కంపెనీ విడుదల చేసిన అప్లికేషన్ ద్వారా టీవీ, సెట్‌టాప్ బాక్స్, డీవీడీ, బ్లూరే ప్లేయర్, వీసీఆర్, ఆంప్లిఫైయర్, ఎయిర్ కండీషనర్, ఏవీ రిసీవర్, డీఎస్‌ఎల్‌ఆర్ కెమెరాలన్నింటినీ నియంత్రించవచ్చు. ఎల్‌జీ, సోనీ మినహా మరే ఇతర కంపెనీ పరికరాలతోనైనా ఇది పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. గూగుల్ ప్లేలో అందుబాటులో ఉన్న ఈ అప్లికేషన్ ధర రూ.426 మాత్రమే.
 

మరిన్ని వార్తలు