‘పొగ’ను అరికట్టే వ్యాక్సిన్!

15 Mar, 2016 23:52 IST|Sakshi
‘పొగ’ను అరికట్టే వ్యాక్సిన్!

పరిపరి  శోధన

ఒక్క వ్యాక్సిన్... ఒకే ఒక్క వ్యాక్సిన్... ‘పొగ’ను పూర్తిగా అరికట్టేస్తుందట! దమ్ముకొట్టకుండా ఉండలేని పొగరాయుళ్లు వ్యాక్సిన్ దెబ్బకు సిగరెట్ల జోలికి పొమ్మన్నా పోరట! తెలిసీ తెలియని వయసులో పొగతాగే అలవాటుకు బానిసై, ఆ తర్వాత దానివల్ల తలెత్తే అనర్థాలను గ్రహించినా మానుకోలేని పొగరాయుళ్లు ప్రపంచవ్యాప్తంగా కోకొల్లలుగా ఉన్నారు. మానసిక చికిత్సలు, మందులు కూడా వారి అలవాటును మాన్పించలేకపోతున్నాయి.

అయితే, అలాంటి వారి చేత పొగతాగే అలవాటును తేలికగా మాన్పించేయగల వ్యాక్సిన్‌ను రూపొందించినట్లు కాలిఫోర్నియాలోని స్క్రిప్స్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ మెదడుపై నికోటిన్ ప్రభావాన్ని నిర్వీర్యం చేసేస్తుందని, దీంతో పొగరాయుళ్లు తమ అలవాటును ఎలాంటి ఇబ్బంది లేకుండా మానేస్తారని వారు చెబుతున్నారు.

 
 

మరిన్ని వార్తలు