బజ్జీ బిర్యానీ.. స్నాకం 'పాకం'

13 Jul, 2019 12:16 IST|Sakshi

స్నాక్స్‌ను వండి ముక్కలు చేసి... మళ్లీ వండితే...ఆ స్నాకం కూరైతే, పులుసులో మునిగి తేలుతుంటే...అబ్భ! స్నాకం పాకమే... ప్లేట్‌లో ఓ కొత్త లోకమే...కాని... ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. ఇంటి మగాళ్లు వంటలో సాయం చేస్తే బాగుండును లేకపోతే పని డబుల్‌ అవుతుంది. ఇంకేం ఇద్దరూ వంట గదిలోకి ప్రవేశించండి...జంట వంటలను పూర్తి చేయండి...

బజ్జీ బిర్యానీ
కావలసినవి: మిర్చి బజ్జీలు – 6 (కొద్దిగా పెద్ద సైజు ముక్కలుగా కట్‌ చేయాలి); బాస్మతి బియ్యం – పావు కేజీ; బిర్యానీ మసాలా – రెండు టీ స్పూన్లు; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; పచ్చి మిర్చి + ఉల్లిపాయ పేస్ట్‌ – ఒక టేబుల్‌ స్పూను; ఉప్పు – తగినంత; నెయ్యి – ఒక టేబుల్‌ స్పూను; జీడిపప్పులు – ఒక టేబుల్‌ స్పూను

తయారీ: ∙బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి నానబెట్టాలి ∙స్టౌ మీద పాన్‌లో నెయ్యి వేసి కరిగాక పచ్చి మిర్చి + ఉల్లిపాయ పేస్ట్‌ వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి మరోమారు వేయించాలి ∙బిర్యానీ మసాలా జత చేసి ఒకసారి బాగా కలపాలి ∙నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని (నీళ్లు ఉంచాలి) జత చేసి బాగా కలియబెట్టాలి ∙ఉప్పు జత చేసి, స్టౌ మంట తగ్గించి, మరోమారు కలిపి మూత పెట్టాలి ∙సగం ఉడికిన తరవాత, మిర్చి బజ్జీ ముక్కలను జత చేసి కలిపి మూత ఉంచాలి ∙పది నిమిషాల పాటు బాగా ఉడికిన తరవాత దింపేయాలి ∙జీడి పప్పులతో అలంకరించి, కుర్మాతో వేడివేడిగా అందించాలి.

పెసరట్టుకూర
కావలసినవి: పెసరట్లు – 2 (పెసరపప్పుతో చేసినవి); ఉల్లి తరుగు – ఒక కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 3; గరం మసాలా – ఒక టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; నూనె – ఒక టేబుల్‌ స్పూను; కొత్తిమీర – ఒక టేబుల్‌ స్పూను; ఉప్పు – తగినంత.
తయారీ: ∙రెండు పెసరట్లను తీసుకుని చల్లారాక, చిన్న చిన్న ముక్కలు చేయాలి ∙ఉల్లి తరుగును మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేయించాలి ∙ఉల్లి పేస్ట్‌ జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙పసుపు, మిరప కారం, గరం మసాలా, ఉప్పు జత చేసి మరో రెండు నిమిషాలు వేయించాలి ∙ఒక కప్పుడు నీళ్లు జత చేసి మరిగించి దింపేయాలి ∙పెసరట్టు ముక్కలు అందులో వేసి కలపాలి ∙కొత్తిమీర తరుగుతో అలంకరించాలి ∙అన్నంలో కమ్మటి నువ్వుల నూనె జత చేసి కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది.

వడలపులుసు
కావలసినవి: సెనగ పప్పు వడలు – 5; చిక్కటి మజ్జిగ – 2 కప్పులు; సొరకాయ ముక్కలు – అర కప్పు; ఉల్లిపాయ – 1 (పెద్ద ముక్కలు చేయాలి); మునగకాడ – 1 (పెద్ద ముక్కలు చేయాలి); తరిగిన పచ్చి మిర్చి – 4; సెనగ పిండి – ఒక టేబుల్‌ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; ధనియాలు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు కొబ్బరి ముక్కలు – పావు కప్పు; ఎండు మిర్చి – 4 (ముక్కలు చేయాలి); కరివేపాకు – రెండు రెమ్మలు; కొత్తిమీర – చిన్న కట్ట.
తయారీ: ∙ఒక పాత్రలో సొరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మునగకాడ ముక్కలు, తరిగిన పచ్చి మిర్చి, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి ∙వేరొక పాత్రలో మజ్జిగకు సెనగ పిండి జత చేసి కవ్వంతో చిలికి, ఉడుకుతున్న ముక్కలలో వేసి కలపాలి ∙మిక్సీలో ధనియాలు, ఎండు కొబ్బరి ముక్కలు, అల్లం తురుము వేసి మెత్తగా మిక్సీ పట్టి, ఉడుకుతున్న పులుసులో వేసి కలియబెట్టాలి ∙ముందుగానే చేసుకున్న సెనగ వడలను ఉడుకుతున్న పులుసులో వేసి ఊరబెట్టాలి ∙స్టౌ మీద చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించి పులుసులో వేసి కలిపి, దింపేయాలి ∙కొత్తిమీరతో అలంకరించి వడ్డించాలి  అన్నంతో కలిపి తింటే రుచిగా ఉంటుంది.

చల్లపునుగులకుర్మా
కావలసినవి: చల్ల పునుగులు – పది; ఉల్లి తరుగు – అర కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 4; టొమాటో తరుగు – ఒక కప్పు; బంగాళ దుంప – 1 (ఉడికించాలి); ధనియాల పొడి – ఒక టీ స్పూను; అల్లం + వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; కొత్తిమీర – అర కప్పు (మిక్సీలో వేసి మెత్తగా చేయాలి); బిర్యానీ ఆకు – 1; పుదీనా – కొద్దిగా; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – పావు టీ స్పూను; నూనె – తగినంత.
తయారీ: ∙స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక ఉల్లి తరుగు వేసి వేయించాలి ∙పచ్చి మిర్చి జత చేసి మరోమారు బాగా వేయించాలి ∙పసుపు జత చేయాలి ∙మిరప కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి కలియబెట్టాలి ∙బంగాళదుంప ముక్కలు జత చేసి మరోమారు కలపాలి ∙టొమాటో తరుగు జత చేసి బాగా కలిపి కొద్దిగా ఉడికించాలి ∙ఒక కప్పు నీళ్లు జత చేసి ఉడికించాలి ∙తగినంత ఉప్పు, బిర్యానీ ఆకు జత చేయాలి ∙పునుగులు వేసి ఉడికించాక, కొద్ది సేపటి తరవాత కొత్తిమీర పేస్ట్‌ వేసి బాగా కలపాలి ∙పది నిమిషాలు ఉడికించాక పుదీనా తరుగుతో అలంకరించి, దింపి, వేడివేడిగా అందించాలి.

పెసరట్లపులుసు(పెసలతోతయారు చేయాలి)
కావలసినవి: పెసలతో చేసిన పెసరట్టు – 1 (కొంచెం మందంగా ఉండాలి); నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; ఎండు మిర్చి – 3 ; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; ఉల్లి తరుగు – అర కప్పు; పసుపు – పావు టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; తరిగిన పచ్చి మిర్చి – 4; ధనియాల పొడి – ఒక టీ స్పూను; చింత పండు పులుసు – ఒక కప్పు (చింతపండును నానబెట్టి పల్చగా పులుసు తీయాలి); బెల్లం పొడి – ఒక టీ స్పూను; కొత్తిమీర – ఒక టీ స్పూను.
తయారీ: ∙పెసరట్టు వేసి వేడిగా ఉండగానే రోల్‌ చేసి, ముక్కలు చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిర్చి, తరిగిన పచ్చి మిర్చి, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి ∙ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙చింతపండు పులుసు, పసుపు జత చేసి ఉడికించాలి ∙బెల్లం పొడి, ధనియాల పొడి వేసి మరోమారు కలియబెట్టి ఉడికించాలి ∙పెసరట్టు ముక్కలు వేసి బాగా కలిపి కొద్దిసేపు ఉడికించాలి ∙కొత్తిమీర తరుగుతో అలంకరించి దింపేయాలి.

టొమాటోబజ్జీలకూర
కావలసినవి: టొమాటోలు – పావు కేజీ; బంగాళ దుంపలు – పావు కేజీ (ఉడికించి, తొక్క తీయాలి); నూనె – తగినంత; ఉల్లి తరుగు – అర కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 4; సెనగ పిండి – ఒక కప్పు; గరం మసాలా – 2 టీ స్పూన్లు; కొత్తిమీర తరుగు – ఒక కప్పు; ఉప్పు – తగినంత; పెసర పప్పు – 4 టీ స్పూన్లు (నానబెట్టాలి).
కూర పోపు కోసం: ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4 (ముక్కలు చేయాలి); కరివేపాకు – రెండు రెమ్మలు; ఉప్పు – కొద్దిగా; ఉల్లి తరుగు – పావు కప్పు; నెయ్యి – 2 టీ స్పూన్లు; ధనియాల పొడి – ఒక టీ స్పూను.

తయారీ: ∙టొమాటోలను మధ్యకు కట్‌ చేసి పక్కన ఉంచాలి ∙నానబెట్టిన పెసర పప్పు, బంగాళ దుంపలను మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి ∙ఈ మిశ్రమంలో గరం మసాలా, ఉప్పు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, కొత్తి మీర తరుగులను కలిపి ముద్దగా చేయాలి ∙ఈ ముద్దలో నుంచి కొద్దికొద్దిగా తీసుకుని టొమాటోలోకి స్టఫ్‌ చేయాలి ∙ఈ టొమాటోలను జారుగా కలుపుకున్న సెనగ పిండిలో ముంచి, కాగిన నూనెలో వేసి దోరగా వేయించి బయటకు తీసుకోవాలి ∙స్టౌ మీద మరో బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి చిటపటలాడించాలి ∙ఉల్లి తరుగు జత చేసి బాగా కలపాలి ∙తయారుచేసి ఉంచుకున్న టొమాటో బజ్జీలను ఇందులో వేసి, కొద్దిగా ఉప్పు, ధనియాల పొడి జత చేసి బాగా కలపాలి ∙కొద్దిగా నీళ్లు చల్లి, రెండు నిమిషాలు ఉడికించి దింపేయాలి.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నలుగురు ఓహ్‌ బేబీలు

పక్కింటి ఎండమావి

చీకటికి అలవాటుపడని కళ్లు

పెత్తనం పోయి కర్ర మిగిలింది

ఎత్తయిన సిగ్గరి

యువత. దేశానికి భవిత

మద్దూరు వడను వదిలేస్తే బాధపడకతప్పదు..

చందమామ నవ్వింది చూడు

ఆఫీస్‌ ఇలా ఉండకూడదు

ప్లాస్టిక్‌ ఇల్లు

సౌరశక్తి ప్లాంట్‌లలో అబూదాబి రికార్డు!

మ్యావ్‌ మ్యావ్‌... ఏమైపోయావ్‌!

మా అమ్మపై ఇన్ని పుకార్లా

చక్కెర చాయ్‌తో క్యాన్సర్‌!

చిన్నారుల కంటి జబ్బులకు చికిత్సాహారం

మేము సైతం అంటున్న యాంకర్లు...

ఒత్తిడి... వంద రోగాల పెట్టు

చేతులకు పాకుతున్న మెడనొప్పి... పరిష్కారం చెప్పండి

మేనత్త పోలిక చిక్కింది

ఆ టీతో యాంగ్జైటీ మటుమాయం

టెడ్డీబేర్‌తో సరదాగా ఓరోజు...!

వినియోగదారుల అక్కయ్య

‘జర్నలిస్ట్‌ కావాలనుకున్నా’

సోపు.. షాంపూ.. షవర్‌ జెల్‌..అన్నీ ఇంట్లోనే!

హెచ్ఐవీకి మందు దొరికింది!

అర్బన్‌ నోస్టాల్జిస్ట్‌లు

పరిసరాలను ముంచెత్తేసిన పెళ్లి!

ఆ గర్భిణి... కళ్లలో మెదిలేది..

వెయిట్‌ లిఫ్టింగ్‌తో గుండెకు మేలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’