పదికోట్ల ఏళ్ల నత్త ఇది...

13 Oct, 2018 00:44 IST|Sakshi

ఫొటో చూశారుగా.. అదీ విషయం. ఎప్పుడో పదికోట్ల ఏళ్ల క్రితం నాటి నత్త ఇది. చెట్ల జిగురు (ఆంబర్‌)లో బందీ అయిపోయింది. మయన్మార్‌లో ఇటీవల బయటపడ్డ ఈ అపురూపమైన శిలాజంలోని నత్త బతికి ఉన్నప్పుడు ఎలా ఉందో.. ఇప్పటికీ అలాగే ఉందని అంటున్నారు శాస్త్రవేత్తలు. పైభాగంలోని పెంకుతోపాటు కణజాలం కూడా ఏమాత్రం చెడిపోకుండా భద్రంగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమ్మీద రాక్షసబల్లులు తిరుగాడిన కాలంలోనే ఈ నత్తలు కూడా మనుగడలో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

జిగురులో చిక్కుకునే సమయానికి నత్త బతికే ఉందని.. శరీరం నిటారుగా ఉండటం, తలచుట్టూ గాలి బుడగ ఉండటం దీనికి నిదర్శమని ఈ శిలాజాన్ని పరిశీలించిన పురాతత్వ శాస్త్రవేత్త జెఫ్రీ స్టివెల్‌ అంటున్నారు. రాక్షసబల్లుల కాలంలో నత్తలు ఉన్న విషయం తెలిసినప్పటికీ వాటి గురించి పూర్తిగా అర్థం చేసుకునే అవకాశం లేకపోయిందని.. పది కోట్ల ఏళ్లనాటి నత్త శరీరం చెక్కు చెదరకుండా లభించడం ద్వారా ఈ కొరత తీరనుందని ఆయన వివరించారు. చెట్ల జిగురులో చిక్కుకుపోయి చెక్కు చెదరకుండా లభించిన అవశేషాల్లో రాక్షసబల్లి తోక, కర్రలాంటి తోక ఉన్న విచిత్ర ఆకారపు జంతువు, ఊసరవెల్లి,  

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా