మంచు కరిగితే..  పెనుముప్పే...

12 Sep, 2018 01:01 IST|Sakshi

వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా ధ్రువ ప్రాంతాల్లోని మంచు వేగంగా కరిగిపోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగి అక్కడున్న మంచు మొత్తం కరిగిపోతే సముద్ర మట్టాలు కనీసం 1.2 మీటర్లు పెరుతాయని అంటోంది తాజా అధ్యయనం. అంటార్కిటికా ప్రాంతంలోని అనేక హిమనదాల్లో కొన్ని లక్షల ఏళ్లుగా మంచు గడ్డకట్టుకుని ఉందని, ఒక్క ద అమున్డ్‌సేన్‌ సీ ఎంబేయ్‌మెంట్‌ హిమనదంలోనే డెన్మార్క్‌ దేశం మొత్తాన్ని 11 కిలోమీటర్ల ఎత్తులో కప్పేయగలిగినంత నీరు మంచురూపంలో ఉందని, ఇదంతా ఒక్కసారిగా కరిగితే ప్రపంచ వ్యాప్తంగా సముద్ర మట్టాలు 5 అడుగుల మేర పెరుగుతాయని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త టెర్రి విల్సన్‌ (ఒహాయో స్టేట్‌ యూనివర్శిటీ) అంటున్నారు.

సుమారు 1.15 లక్షల ఏళ్ల నుంచి ఇక్కడ పేరుకుపోతున్న మంచు అడుగుభాగంలోని భూమిపై విపరీతమైన ఒత్తిడిని సష్టిస్తోందని వీరు అంటున్నారు. అయితే గత 200 ఏళ్లుగా ఈ హిమనదం కొద్దోగొప్పో స్థిరంగా ఉందని.. 2005 నుంచి మాత్రం కరిగిపోవవడం వేగం పుంజుకున్నట్లు వివరించారు. మంచు కరిగిపోవడంతో ఒత్తిడి తొలిగి భూ ఉపరితలం ఎత్తు కూడా పెరుగుతోందని విల్సన్‌ వివరించారు. 

మరిన్ని వార్తలు