ఇలా పుట్టింది

5 Aug, 2017 23:56 IST|Sakshi
ఇలా పుట్టింది

కర్కోటకుడు

ఎవరైనా అన్యాయంగా అవతలివారిని బాధిస్తుంటే, కొంచెం కూడా జాలి చూపించకుండా ఇబ్బంది పెడుతుంటే వారిని కర్కోటకుడు అంటాం. మహాభారతంలోని అరణ్యపర్వంలో కర్కోటకుడి ప్రస్తావన కనిపిస్తుంది. నిషాధిపతి నలుడు చాలా అందగాడు. అతడు కుండిన పురి రాజకుమార్తె దమయంతిని పెళ్లాడాడు. కలిప్రభావం వల్ల నలుడు జూదంలో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో అడవుల పాలయ్యాడు. మార్గమధ్యంలో ఒకచోట దావాగ్ని రగులుతోంది.

ఆ అగ్నిలో చిక్కుకొని ఒక సర్పం ‘రక్షించండి’ అని ఆర్తనాదాలు చేస్తోంది. నలుడు జాలితో ఆ సర్పాన్ని మంటల నుండి బయట పడేశాడు. అయితే, చేసిన మేలు మరచిన ఆ సర్పం నలుడిని కాటేసింది. ఆ విషప్రభావానికి నలుడు వికృతరూపాన్ని పొందాడు. నిజానికి కర్కోటకుడు నలుడిని కాటువేసింది మంచి చేసేందుకే, అతణ్ణి అజ్ఞాతవాసంలో ఉంచేందుకే. అయినప్పటికీ, చేసిన మేలు మరచి పోయి, కఠినంగా వ్యవహరించేవారిని కర్కోటకుడనే పిలుస్తున్నారు.

మరిన్ని వార్తలు