సోనాజాజి

26 Oct, 2017 23:18 IST|Sakshi

సోనాక్షి సిన్హా కొంచెం బొద్దుగా ఉంటారు.
అయినా చూశారా..
ఫ్యాషన్‌ ఎంత బాగా ఫిట్‌ అవుతుందో..!
సైజ్‌జీరోలకే కాదండీ
మనకీ ఫ్యాషన్‌ అవసరం.
అందంగా ఉండటానికి
‘సన్న’జాజులే కాన్నర్లేదు
బొద్దుగా ఉన్నా సోనాజాజిలా ఉంటే చాలు.

లెహంగా మీదకు స్లిట్‌ లాంగ్‌ కుర్తీ వేస్తే వచ్చే అందం ఇది. లాంగ్‌ స్లీవ్స్‌ గల వెల్వెట్‌ ఫ్యాబ్రిక్‌ కుర్తీని బెనారస్‌ లెహెంగా మీదకు ధరించింది. పుట్టిన రోజు వంటి ఈవెనింగ్‌ పార్టీలకు ఈ డ్రెస్‌ బాగా నప్పుతుంది. బొద్దుగా ఉన్నా కట్, ఫిట్‌ సరిగ్గా ఉంటే అందంగా వెలిగిపోతారు.

బొద్దుగా ఉన్నవారు నెటెడ్‌ శారీస్‌ కట్టుకుంటే ఎబ్బెట్టుగా ఉంటుందని ఫీలవుతుంటారు. ఇలాంటి చీరలు కట్టుకున్నప్పుడు శారీ కలర్‌ బ్లౌజ్, సింపుల్‌ జువెల్రీని ధరించాలి.

ఇది పూర్తిగా రెట్రో స్టైల్‌. చెక్స్‌ స్కర్ట్‌ మీదకు ప్లెయిన్‌ ట్యూనిక్‌.. దాని మీదకు బ్లేజర్‌ ధరిస్తే పార్టీలో వెలిగిపోతారు. ఈ స్టైల్‌కి బంగారం కాకుండా యాక్ససరీస్‌ సిల్వర్‌వి ఎంచుకోవాలి. బర్త్‌డే, కాక్‌టెయిల్‌ వంటి ఈవెనింగ్‌ పార్టీలకి ఈ తరహా స్టైల్‌ బాగా నప్పుతుంది.

ఇది రెడీమేడ్‌ హాఫ్‌శారీ.  ఒకే రంగు లెహెంగా, ఓణీని ఎంపిక చేసుకోవడం, ఆభరణాల హంగు లేకుండా చూసుకోవడం, పొడవుగా వదిలేసిన హెయిర్‌.. ఇలాంటి జాగ్రత్తలు వల్ల బొద్దుగా ఉన్నప్పటికీ డ్రెస్‌కి మరింత అందాన్ని తీసుకురావచ్చు.

ఇదీ రెట్రో స్టైల్‌ కాన్సెప్ట్‌. రా సిల్క్‌ ఫ్యాబ్రిక్‌తో డిజైన్‌ చేసిన లెహెంగా దాని మీద ఎంబ్రాయిడర్‌ వర్క్, మగవారు ధరించే   డబుల్‌ కాలర్‌ సూట్‌ని ఇలా డిజైన్‌ చేసి సెట్‌ చేయడంతో గ్రాండ్‌గా కనువిందు చేస్తుంది. కాక్‌టెయిల్‌పార్టీస్‌కి ఈ డ్రెస్సింగ్‌ బాగా నప్పుతుంది.

డెనిమ్‌ ప్యాంట్, వైట్‌ ట్యూనిక్‌ వంటి క్యాజువల్‌వేర్‌ ధరించినప్పుడు నలుగురిలో   స్టైలిష్‌గా కనిపించాలనుకునే అమ్మాయిలు ఫ్రంట్‌ ఓపెన్‌ కేప్‌ ధరిస్తే చాలు.

రెండ్‌ లాంగ్‌ గౌన్‌ వెస్ట్రన్‌ పార్టీలకు బాగా నప్పుతుంది. డీప్‌ వి–నెక్, బాటమ్‌ అన్‌ఈవెన్‌కట్‌ .. ఈ డ్రెస్‌ని అందంగా మార్చింది. ఈవెనింగ్‌ పార్టీలలో స్టైలిష్‌ లుక్‌తో వెలిగిపోయేలా చేస్తుంది. ఒకే రంగు, వి–నెక్, స్లీవ్‌లెస్‌ ప్యాటర్న్‌ వల్ల బొద్దుగా ఉన్నా సన్నగా కనిపిస్తారు.

భార్గవి కూనమ్‌
ఫ్యాషన్‌  డిజైనర్‌

మరిన్ని వార్తలు