గీత స్మరణం

20 Nov, 2013 00:37 IST|Sakshi
గీత స్మరణం

పల్లవి :
 ఆమె: ఏయ్..
 అతడు: అబ్బో! దోరవయసు చిన్నది లాలాలాలహ
 బలే జోరుగున్నది లాలాలాలహ దీని తస్సదియ్యా
 కస్సుమంటున్నదీ కవ్విస్తూ వున్నదీ
 ॥
 చరణం : 1
 ఆ: ఓయ్! ఒళ్లెలావుంది?
 అ: ఒళ్లా! ఒళ్లు ఝల్లుమంటుంది నిన్ను చూస్తే
 ఏదోలా ఉంటుందీ నిన్ను తాకితే
 ॥
 ఆ: ఆహా. ఉంటది... ఒక్కటిస్తే గూబగయ్ అంటది
 అ: ఒక్కటిచ్చి ఒక్కసారి నీవాణ్ణీ చేసుకో
 ఎన్నటికీ మరవులేని ఎన్నో సుఖాలందుకో
 ఆ: ఛీ పో... అ: అబ్బో...
 ॥
 చరణం : 2
 ఆ: ఒళ్లు మండి పోతుందీ నిన్ను చూస్తే
 చెంప ఛెళ్లు మంటుందీ హద్దుమీరితే
 ॥మండి॥
 అ: అహా... అలాగా!
 ఆ: అలా గిలాగనుకోకు అందరిలా నన్నూ
 చెడామడా పేలావో పెరికేస్తా చూడు
 అ: అబ్బో... నిజంగా...
 ఏ తారలోనూ ఈ తీరులేదు
 ఏ పూవులోనూ నీ నవ్వులేదు
 ॥
 చిత్రం : దేవుడు చేసిన మనుషులు (1973)
 రచన : దాశరథి
 సంగీతం : రమేష్‌నాయుడు
 గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల
 
 నిర్వహణ: నాగేశ్

మరిన్ని వార్తలు