ఈ పాటకు ట్యూన్ తెలుసా?

12 Feb, 2014 00:29 IST|Sakshi
ఈ పాటకు ట్యూన్ తెలుసా?

 పల్లవి :
 అతడు: అద్దంకి చీరకట్టె ముద్దుగుమ్మా
  చిక్కవమ్మా దక్కవమ్మా
 ఆమె: సయ్యంటు సైటు కొట్టే సత్యభామ
  చూసుకోమ్మా కాచుకోమ్మా
 అ: ఎగిరే పొగరే చాలే దిగవే ఇకనైనా
 ఆ: తరిమే ఉరిమే మామ తగువుకి దిగుదామా
 ॥
 చరణం : 1
 అ: ఊరు పేరు చెప్పకుండా
  హఠాత్తుగా దిగొచ్చెనా
 ఆ: మారు మాటలాడకుండా
  వరించుకో నీదాననే
 అ: దొరికితే వదలనే జాణ
  ఉరకకు మరి ఇక పైనా
 ఆ: తరిమితే తడబడిపోనా
  మరిమరి ముడిపడిపోనా
 అ: గజిబిజి కథలను గడుసుగ నడిపిన
  తగవుల మగువకు తెగువలు ముదిరెనురో
 ॥
 బృందం: తయ్యకు తయ్యకు తయ్యారా...  (2)
 కుచు కుచు కుచు కుచు...     (2)
 చరణం : 2
 ఆ: బ్రహ్మచారి బాధలన్నీ పోవాలని వచ్చానిలా
 అ: బ్రహ్మరాతలేమో గాని భలే ముడి పడిందిలా
 ఆ: బుసలిక చాలునులేరా
  చెలి గుసగుస వినుకోరా
 అ: విసురులు విసరకే జాణ
  కొసవరకిది నడిచేనా
 ఆ: పెదవుల పదవిని వదలని తపనకి
  మగ సెగ తగిలితె మగతలు కలిగెనురో
 ॥
 చిత్రం : శుభాకాంక్షలు (1997)
 రచన : సామవేదం షణ్ముఖశర్మ
 సంగీతం : కోటి
 గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర, బృందం
 నేడు జగపతిబాబు బర్త్‌డే
 
 
 

మరిన్ని వార్తలు