గీత స్మరణం

5 Dec, 2013 00:41 IST|Sakshi
గీత స్మరణం

 పల్లవి :
 
 ఒకే కావ్యం... ఒకే శిల్పం...
 ఒకే చిత్రం... అదే ప్రణయం
 మన తనువు మారును తరము మారును
 స్వరము మార్చదు ప్రేమ
 ప్రేమ మరణం...
 ప్రేమ మరణం రెండూ ఒకటే అంటే నమ్మాలి
 ఆ స్వర్గం అంటూ చూడాలంటే రెండూ ఉండాలి
 ॥మరణం॥॥కావ్యం॥
 
 చరణం : 1
 
 తనువులేకం కాకముందు మనసులౌను ఏకమే
 తనువు తనువుకి ప్రాణ ద్వారం ప్రేమే
 ఎదలు రె ండు దూరమైన పెదవులౌను చేరువే
 పెదవి ద్వారా ఎదను చేరెను ప్రేమే
 ముళ్లలాంటి కళ్లతోటి అంతుచూస్తుంది
 పువ్వులాంటి నవ్వుతోటి ఆయువిస్తుంది
 ॥మరణం॥
 
 చరణం : 2
 
 ప్రేమ పాట పాతది... పూట పూట కొత్తది
 గాలిలేని చోటైన మోగేనిది
 ప్రేమ అంటే విషములే... విషములోన విశేషమే
 ఇదే జన్మలో మరో జన్మకు మార్గమే
 బీడుభూమిలో మెట్టభూమిలో మొగ్గ ప్రేమేలే
 మండుటెండలో ఎండమావిలో నీడ ప్రేమేలే
 భళా చాంగు భళా చాంగు... భళా చాంగు భళా
 నా ఫలాలన్నీ ఫలించేలా రావే పుష్పకళ
 ఫలాలన్నీ ఫలించేలా రావే పుష్పకళ
 నిను స్మరిస్తేనే నాలో స్వర్ణకళ
 తరంగంలా... తరంగంలా...
 రావే రావే... రావే రావే...
  విహంగంలా... విహంగంలా...
 
 చిత్రం : వర్ణ (2013)
 రచన : చంద్రబోస్
 సంగీతం : హారీస్ జైరాజ్,
 గానం : ఎస్.పి.బాలు, బృందం

 
 నిర్వహణ: నాగేశ్

 

మరిన్ని వార్తలు