గీత స్మరణం

12 Dec, 2013 22:57 IST|Sakshi
గీత స్మరణం

పల్లవి :
 
 పూలలో తేనె ప్రేమ... తేనెలో తీపి ప్రేమ
 తీపిలో హాయి ప్రేమ... హాయి నీవంది ప్రేమ
 బహుశా నా ప్రాణమై నిలిచే నీ ప్రేమా
 మనసో అది ఏమిటో తెలియనిదీ ప్రేమా
 ॥
 
 చరణం : 1
 
 కమ్మని కల కౌగిలి కథ... ఎర్రని పెదాలలో ప్రేమ
 వెన్నెల కల వెచ్చని వల నీవు నేనైన ప్రేమ
 ॥
 కాలం చెల్లని ప్రేమ... నీ దూరపు చేరువ ప్రేమ
 సింధూరపు తూరుపు ప్రేమ నీవు సుమా...
 ॥
 
 చరణం : 2
 
 ఆ పరిచయం ఈ పరిమళం పూసిన
   ఎడారి నా ప్రేమ
 కోరిన సుఖం చేరిన సగం నాకు నీవైన ప్రేమ
 ॥పరిచయం॥
 చూపుగ నాటిన ప్రేమ...
   కనుచూపుకు అందని ప్రేమ
 అందానికి అందం తెచ్చే ప్రేమ సుమా...
 
 రచన : వేటూరి, గానం : రాజేశ్
 
 పల్లవి :
 
 బ్రహ్మ... ఓ బ్రహ్మ...
 మహ ముద్దుగా ఉంది గుమ్మా
 బొమ్మా... ఈ బొమ్మా...
 అరె అందానికే అందమా
 ॥
 జాబిల్లిలా ఉంది జాణా
 ఆ నవ్వు మీటింది వీణ
 ఏడేడు లోకాలలో ఇంత అందాన్ని
   ఈ రోజే చూశానుగా
 ॥
 
 చరణం : 1
 
 నీలాల ఆ కళ్లలో నీరెండ దాగున్నదో
 ఆ లేడి కూనమ్మ ఈ వింత చూసిందా ఏమంటదో
 ఆ పాల చెక్కిళ్లలో మందారమే పూచేనో
 ఈ చోద్యమే చూసి అందాల గోరింట ఏమంటదో
 నా గుండె దోసిళ్లు నిండాయిలే నేడు
   ఆ నవ్వు ముత్యాలతో
 ఈ జ్ఞాపకాలన్ని నే దాచుకుంటాను ప్రేమతో
 ॥
 
 చరణం : 2
 
 నూరేళ్ల ఈ జన్మనీ ఇచ్చింది నువ్వేననీ
 ఏ పూజలూ రాని నేనంటే నీకెంత ప్రేముందనీ
 ఈ వేళ ఈ హాయినీ నా గుండెనే తాకనీ
 అందాల ఆ రాణి కౌగిళ్లలో వాలి జీవించనీ
 ఆ పంచభూతాలు ఒక్కొక్కటై వచ్చి
   చల్లంగ దీవించనీ
 తన చెంతకే చేరి ఏ రోజు చెప్పాలి ప్రేమనీ
 ॥
 
 రచన : కులశేఖర్
 గానం : ఎస్.పి.బాలు

 
 చిత్రం : జెమిని (2002)
 సంగీతం : ఆర్.పి.పట్నాయక్

 
 నిర్వహణ: నాగేశ్
 

మరిన్ని వార్తలు