గీత స్మరణం

31 Oct, 2013 00:20 IST|Sakshi
గీత స్మరణం

పల్లవి :


 నా పరువం నీకోసం...     (2)
 పానుపువేసి ఉన్నదీ వాకిలి తీసి ఉన్నదీ
 కోరిక పండగా నిండుగా...
 ॥పరువం॥
 
 చరణం : 1


 రాకరాక వచ్చానోయి మీ ఇంటికి ఈ పొదరింటికీ
 లేకలేక నచ్చావోయి నా కంటికి నా చిగురొంటికీ
 ఈ సమయం నా హృదయం...     (2)
 నిన్ను చూసి నాగులాగ ఊగుతున్నదీ చెలరేగుతున్నదీ
 ॥పరువం॥
 
 చరణం : 2


 ఒక్కమాటు ఇక్కడే నువ్వుండిపోరా రుచులందుకోరా
 తియ్యగా నేనిప్పించేది తీసుకోరా ఆపై చూసుకోరా
 ఈ రోజూ ఇక రాదూ...     (2)
 ఈ కన్నెవయసు అందుకేలే కాగుతున్నది సెగ కాచుకున్నది
 ॥పరువం॥
 
 చిత్రం : యుగంధర్ (1979)
 రచన : డా॥సి.నారాయణరెడ్డి
 సంగీతం : ఇళయరాజా
 గానం : ఎస్.జానకి

 
 నిర్వహణ: నాగేశ్
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు