కమ్మని బోనం

30 Jun, 2017 23:27 IST|Sakshi
కమ్మని బోనం

1 పప్పు వడ

కావలసినవి: పచ్చి శనగపప్పు –  అరకిలో; మినప్పప్పు–పావుకిలో; కరివేపాకు– రెండు రెమ్మలు; కొత్తిమీర –ఒక కట్ట; ఉల్లిగడ్డ – 1; పచ్చిమిరపకాయలు– 5; అల్లం–చిన్నముక్క; ఉప్పు – తగినంత; నూనె –వేయించేందుకు తగినంత.

తయారి: పచ్చిశనగపప్పు, మినçప్పప్పు రెండు గంటలసేపు నీళ్ళలోనానబెట్టాలి. నానబెట్టిన పప్పులను వక్క చెక్కగా రుబ్బాలి.తరువాత అల్లం, పచ్చిమిరపకాయలను ముద్దగా నూరి, ఉల్లిగడ్డ,  కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగి, వీటన్నిటినిపిండిలో కలుపుకోవాలి. నూనె వేడిచేసి పిండి తీసుకుని అరచేతిలో ఒత్తి వడలు వేసుకోవాలి. వీటిని కోడికూర, మటన్‌ షోర్వాతో తింటే  మరింత రుచిగా ఉంటుంది.

2 పులిహోర
కావలసినవి: బియ్యం – కిలో; చింతపండు గుజ్జు – అర కప్పు; నూనె– పావు కప్పు; పల్లీలు (వేరుశనగకాయలు)– పావు కప్పు; శనగపప్పు – టీ స్పూను; మినప్పప్పు – టీ స్పూను;ఎండు మిరపకాయలు – 4; పచ్చిమిరపకాయలు – 5 ; నువ్వులపొడి – 2 టీ స్పూన్లు; పసుపు – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; కరివేపాకు – 4 రెమ్మలు

తయారి: అన్నం ఉడికించి చల్లార్చాలి. బాణలిలో నూనెవేసి ఎండుమిరపకాయలు, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఒకదాని తరువాత ఒకటి వేసివేయించాలి. ఆ తరువాత చింతపండుగుజ్జు, ఉప్పు వేసి దగ్గరపడేవరకూ ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి.

3 పరమాన్నం
కావలసినవి: పాలు– అరలీటరు, బియ్యం – కప్పు; బెల్లం– కప్పు; చక్కెర– పావు కప్పు; ఏలకులు – 3; జీడిపప్పు – 2 టీస్పూన్లు; కిస్‌మిస్‌లు – 2 టీస్పూన్లు; నెయ్యి– 4 టీస్పూన్లు

తయారి: జీడిపప్పుని, కిస్‌మిస్‌లను విడివిడిగా నేతిలో వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. పాలు బాగా కాగిన తరువాత బియ్యం వేసి బాగా ఉడకనివ్వాలి. బెల్లం, చక్కెర వేసి కొంచెం దగ్గర పడిన తరువాత దింపుకోవాలి. గార్నిషింగ్‌ కోసం ఏలకుల పొడి, వేయించిన జీడిపప్పులను, కిస్‌మిస్‌లను వేసి స్టౌ పై నుంచి దించేయాలి.

4 బగారా అన్నం
కావలసినవి బియ్యం – కిలో; ఉల్లిపాయలు – 2; నూనె లేదా నెయ్యి – 5 టీ స్పూన్లు; అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – 1 టీ స్పూను; పచ్చిమిరపకాయలు –5; కొత్తిమీర – కట్ట; పుదీన – 2 కట్టలు; పెరుగు – 1 కప్పు; బిర్యానీ ఆకులు – 2; ఏలకులు – 2; లవంగాలు – 2.

తయారి: వెడల్పాటి గిన్నెలో నూనె వేడిచేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, పుదీన, ఏలకులు, లవంగాలు, ఉల్లిగడ్డ కలిపి వేయించాలి. తరువాత పెరుగు కలపాలి. ఈమిశ్రమంలో  రెండు లీటర్ల నీళ్ళుపోసి మరిగాక బియ్యం పోసి ఉడికాక కొత్తిమీర కలిపి దించేయాలి. బగారా అన్నం వండితే ఇంటికి పండగ వచ్చేసినట్టే.

5 జొన్నరొట్టె
కావలసినవి: జొన్నపిండి – 2 కప్పులు, నీళ్లు   –  తగినన్ని

తయారి: జొన్నపిండి గోరు వెచ్చటి నీరు, ఉప్పు కలిపి ముద్దలా చేసుకోవాలి. చిన్నముద్ద తీసుకొని పీట మీద లేదా బండమీద చేత్తోఒత్తుతూ చపాతీల్లా గుండ్రంగా చేసుకోవాలి. పీటకి అంటుకోకుండామధ్య మధ్యలో పిండిని చల్లుకుంటూ గుండ్రంగా  చేసుకోవాలి. దీనినిపెనంమీద వేసి రెండువైపులా ఎర్రగా కాల్చి తీసివేయాలి. వీటికివెల్లుల్లి కలిపిన కారం, వెన్న అద్దుకుని తింటే చాలా రుచిగా వుంటాయి.

తయారి:మొక్కజొన్న కంకులనుంచి గింజలను వేరుచేసిఉప్పు, పచ్చిమిరపకాయలు, ధనియాలు, వెల్లుల్లి వేసి మెత్తగారుబ్బుకోవాలి. బాణలిలో నూనెవేడిచేసి నిమ్మకాయ సైజంతపిండి తీసుకొని అరచేతిమీదఒత్తి నూనెలో వేయాలి.ఎర్రగా కాల్చి తీసివేయాలి. నాటు కోడి, ఖీమా కూరలు జొన్నరొట్టెలకు మంచి కాంబినేషన్‌.



6 గోలిచ్చిన మాంసం
కావలసినవి: మటన్‌ – కేజి; ఉల్లిపాయలు – 2; అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – రెండు స్పూన్లు; కారం – 2 టీ స్పూన్లు; పసుపు – అర టీ స్పూన్‌; ఉప్పు – తగినంత; జీలకర్ర పొడి – టీ స్పూన్‌; పచ్చిమిరప పేస్ట్‌ – టీ స్పూన్‌; కరివేపాకు – ఒక రెబ్బగసగసాలు – 2 టీ స్పూన్లు; పచ్చికొబ్బరి – 2 టీ స్పూన్లునూనె – 4 టీ స్పూన్లు

తయారి: మటన్‌లో ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర‡పొడి కలిపి పక్కన ఉంచుకోవాలి. కడాయిలో నూనె వేసి ఉల్లిపాయముక్కలను ముందుగా వేయించి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి వేగాక పక్కన ఉంచుకున్న మటన్‌ ముక్కల్ని కూడా కలిపి వేయించాలి. ఒక టీ కప్పు నీళ్ళు పోసి 20 నిముషాలు మగ్గనివ్వాలి. ఈ లోగా కొబ్బరి గసగసాలు ముద్దచేసుకొని ఎర్రకారం, కొత్తిమీర, కరివేపాకువేసి మరికొద్దిసేపు మగ్గనిచ్చి దించేయాలి. చుట్టాల మర్యాదకు ఇది ప్రత్యేకం.

7 కార్జం వేపుడు
కావలసినవి: కార్జం – అర కిలో (పొట్టేలు లివర్‌); నూనె – తగినంత; అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – 2 టీస్పూన్లు; ఉల్లిగడ్డ తరుగు – 1 కప్పు; గరంమసాలా – చిటికెడు; కారం – 2 టీస్పూన్లు; పసుపు – తగినంత; ఉప్పు – తగినంత

తయారి:  బాణలిలో నూనె వేసి ఉల్లిగడ్డ వేయించి తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. లివర్‌ ముక్కలు కూడా వేసి వేయించాలి. ఈ మిశ్రమానికిఉప్పు, గరంమసాలా, కారం, కలుపుకోవాలి. ముక్కలు మెత్తగా కావాలనుకుంటే కొద్దిగా నీళ్ళు చల్లివేయించాలి.

8 మక్కగారెలు
కావలసినవి: మొక్కజొన్న కంకులు  –  4; ఉప్పు – తగినంత; నూనె – వేయించేందుకు సరిపడినంత; పచ్చిమిరప తరుగు – ఒక స్పూను; వెల్లుల్లి – 4 రేకులు

తయారి: మొక్కజొన్న కంకులనుంచి గింజలను వేరుచేసిఉప్పు, పచ్చిమిరపకాయలు, ధనియాలు, వెల్లుల్లి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. బాణలిలో నూనెవేడిచేసి నిమ్మకాయ సైజంతపిండి తీసుకొని అరచేతిమీద ఒత్తి నూనెలో వేయాలి. ఎర్రగా కాల్చి తీసివేయాలి. జోరువానకు బెస్ట్‌ కాంబినేషన్‌.

9 నాటుకోడి షోరువా
కావలసినవి: కోడి – కేజీ; ఉల్లిపాయలు –2; ఎండు కొబ్బరి  – 2 టీ స్పూన్లు; గసగసాలు – 2 టీ స్పూన్లు; అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – 2 టీ స్పూన్లు; నిమ్మరసం – 2 టీస్పూన్లు; ఉప్పు – తగినంత.

తయారి: నాటుకోడికి చిటికెడు పసుపు కలిపి ఒక ఉడుకురానివ్వాలి. నూనె వేడిచేసి ఉల్లిపాయల్ని వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ కూడా చేర్చి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. ఈ మిశ్రమంలో ఉడికించి ఉంచినకోడి మాంసాన్ని కలిపి మగ్గనివ్వాలి. రెండు కప్పుల నీళ్ళు పోసి బాగా ఉడికించి చివరిగా నిమ్మరసం కలుపుకోవాలి. మాంసాహార ప్రియులకు నోరూరించే వంటకం ఇది.

10 పచ్చి పులుసు
కావలసినవి: చింతపండు – 100 గ్రాములు; కారప్పొడి – టీ స్పూన్‌; ధనియాల పొడి – అర టీ స్పూన్‌; ఉప్పు – తగినంత; పసుపు – చిటికెడు; పచ్చిమిర్చి పేస్ట్‌ – టీ స్పూన్‌; ఉల్లిగడ్డ తరుగు – అరకప్పు; నువ్వులు – 50 గ్రా.; కరివేపాకు – రెండు రెబ్బలు ; కొత్తిమీర – తగినంత; నూనె – రెండు టీ స్పూన్లు.

తయారి: చింతపండు పులుçసుకు కారప్పొడి, ధనియాల పొడి, ఉప్పు, పసుపు కలుపుకోవాలి. నువ్వులు వేయించి పొడి చేసి ఆ పొడిని కూడా ఈ పులుçసుకు కలపాలి. నూనె వేసి ఎండు మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర తాలింపు వేసి పులుసును పోసి దించేయాలి. ఉల్లిపాయ ముక్కలు కలపాలి. వేడివేడి అన్నంలో ముద్దపప్పుతోపాటు పచ్చిపులుసు తింటే చాలారుచిగా, మజాగా ఉంటుంది. ఖర్చులేని పచ్చిపులుసు సామాన్యుడి వంట.

మరిన్ని వార్తలు