బ్రహ్మ ముహూర్తంలో మేలుకోవడం

7 Feb, 2018 00:48 IST|Sakshi
తెల్లవారుజాము

సైన్స్‌ – సంప్రదాయం

బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలని మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున అని తెలుసు కానీ.. సరైన సమయం మాత్రం చాలామందికి తెలియదు. సూర్యోదయానికి ముందు 48 నిమిషాలను బ్రహ్మ ముహూర్తం అంటారు. బ్రహ్మ ముహూర్తం పూజలు, జపాలకు, మంచి ఆలోచనలు చేయడానికీ విశిష్టమైన సమయంగా చెబుతారు పెద్దలు. ఇంతకూ దీని గురించి ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఏం చెబుతోందో చూద్దామా...

∙రాత్రి తొందరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచేవారికి ఆనారోగ్య సమస్యలు రావని ఆయుర్వేదం చెబుతోంది. 
∙ప్రతిరోజూ సూర్యోదయం చూసే అలవాటు ఉన్నవారికి గుండె, మెదడు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
∙బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం వల్ల సూర్యుని లేలేత కిరణాలు మన పైన ప్రసరిస్తాయి. సూర్యరశ్మి లో ఉండే విటమిన్‌ డి ఎముకల బలానికి సహాయపడుతుంది.... 
∙ఈ సమయంలో నిద్రలేవటంలో వైజ్ఞానిక రహస్యం ఇమిడి ఉంది. భూమి తన చట్టూ తాను తిరగటం వలన రాత్రింబగళ్లూ ఏర్పడతాయి. బ్రాహ్మీముహూర్తం నుంచి మధ్యాహ్నం వరకు ఉండే సమయం ఉత్తేజం కలిగించే సమయం. ఈ సమయంలో దేహంలో అన్ని రకాల శక్తులు వృద్ధి పొందుతాయి, చురుగ్గా పనిచేస్తాయి. 
∙బ్రాహ్మీ ముహూర్తంలో పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తాయి. పశుపక్ష్యాదులు కూడా బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేస్తాయి. అంతేకాదు, సకల పుష్పాలు ఈ ముహూర్తంలోనే పరిమళాలు వెదజల్లుతాయి.  ఈ ముహూర్తంలో నిద్రలేస్తే, మన బుద్ధి వికసించి ఉత్తమమైన ఆలోచనలు వస్తాయి.  

మరిన్ని వార్తలు