కొబ్బరి ఐస్‌క్రీమ్‌

12 May, 2018 00:23 IST|Sakshi

వెరైటీ

కొబ్బరి ఐస్‌క్రీమ్‌ అంటే సరదాగా ఉంది కదూ. మనకు కోన్‌ ఐస్‌క్రీమ్, బాల్‌ ఐస్‌ క్రీమ్‌లాంటివి తెలుసు. కొబ్బరి ఐస్‌క్రీమ్‌ అంటే ఏమిటో తెలీదు కదా. బెంగళూరులోని వెంకట రమణ దేవాలయం దగ్గర, సీతారామ కావత్‌ అనే 60 సంవత్సరాల వ్యక్తి కనిపెట్టిన కొత్త రకం ఐస్‌ క్రీమ్‌ ఇది.

ఆయన దగ్గర మంగళూరు కొబ్బరిబొండాలు తాగిన తరవాత, ఆ బొండాన్ని మధ్యకు చీల్చి, లేత కొబ్బరిని ఒకే దానిలోకి తీసి, అందులో మనకు కావలసిన ఫ్లేవర్‌ ఐస్‌క్రీమ్, (వెనిలా, స్ట్రాబెర్రీ, బటర్‌స్కాచ్‌) రకరకాల పండ్ల  (అరటి, ద్రాక్ష, దానిమ్మ, పైనాపిల్‌) ముక్కలు వేసి మళ్లీ పైన కొద్దిగా ఐస్‌క్రీమ్‌ వేసి, ఆప్యాయంగా అందిస్తాడు. ఇది ఆయనే కనిపెట్టాడు. ఈ ఐస్‌క్రీమ్‌ ఖరీదు, అరవై రూపాయలు మాత్రమే. 

మరిన్ని వార్తలు