లక్ష్మీ కాసుల గలగలలు

24 Aug, 2018 00:20 IST|Sakshi

 ఆభరణం

ప్రతీ ఏటా కాసు
శ్రావణమాసం వ్రతానికి ప్రతియేటా లక్ష్మీ కాసును కొనడం ఆనవాయితీగా ఉంటుంది చాలామందికి. ఈ కాసులు కొన్ని పోగయ్యాక వాటితో సింపుల్‌ డిజైన్స్‌ చేయించుకోవచ్చు. ఇవి ప్లెయిన్‌ శారీస్, అనార్కలీ వంటి వాటి మీదకూ ధరించవచ్చు. 

మామిడి కాసులు
మామిడి పిందెల రూపంలో ఉండే కాసులను కూడా ఇప్పుడు తయారు చేస్తున్నారు. వీటిని మ్యాంగోమాల అంటారు. మన సంప్రదాయ వేడుకల్లో మామిడితో ఉన్న అనుబంధం వర్ణించలేనిది. అందుకే మామిడి పిందెల డిజైన్లు గల జరీ చీరలు, ఆభరణాలు ఎప్పుడూ గ్రాండ్‌గా ఉంటాయి. కనీసం 25 పైసలంత సైజ్‌లో ఉండే  కాసులతో తయారయ్యే మాల 30 నుంచి 300గ్రాముల దాకా బరువు ఉంటున్నాయి.  

డైమండ్స్‌కు కాసుల జత
కాసు హారానికి ఫ్లాట్‌ డైమండ్స్, సింగిల్‌ కట్‌ డైమండ్స్, కెంపులు, పచ్చలు, ముత్యాలతోనూ... ఇలా కంటెంపరరీగా డిజైన్‌ చేయించుకోవచ్చు. జూకాలు, గాజులు కూడా కాసులతో చేయించుకుంటే పట్టు చీరల మీదకు ఈ డిజైన్‌ ఆభరణాలు బాగా నప్పుతాయి.

శ్రావణమాసం వ్రతాలు, వివాహ వేడుకలకు  పట్టు చీరల మీదకు కాంబినేషన్‌గా ఎంత హెవీగా ఆభరణాలు వేసుకున్నా అందంగానే ఉంటుంది. వాటిలో బామ్మల కాలం నాటి లక్ష్మీ కాసుల మాలలు/హారాలు మాత్రం ఎప్పుడూ సవ్వడి చేస్తూనే ఉన్నాయి. అందుకే కాసుల పేరు అనేది ఆధునిక మహిళల మెడలోనూ గలగల మంటోంది.
 

మరిన్ని వార్తలు