కంటె కనువిందు

3 Aug, 2018 00:28 IST|Sakshi

ఆపాత ఆభరణం

నానమ్మ, అమ్మమ్మల మెడలలో అప్పట్లో కంటె ఆభరణం (దీని నుంచే కంఠాభరణం అనే పేరు వచ్చి ఉంటుంది) ఉండేది. వేడుకలకే కాకుండా ఎప్పుడూ ధరించి ఉండేవారు. ఆ తర్వాత గోల్డ్‌ షాపుల్లో ‘కంటె’ కరిగి ఆధునిక నగగా రూపాంతరం చెందింది. కానీ, ఇప్పుడు ‘కంటె’ ట్రెండ్‌ మళ్లీ వచ్చింది. వేడుకలలో కనువిందు చేసే కంఠాభరణమైంది.కంటె ట్యూబులా ఉంటుంది. దీంట్లో వేల డిజైన్స్‌ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.  కంటెకు పెండెంట్‌ వేసుకోవచ్చు. పెండెంట్‌ లేకుండానూ కంటెను ధరించవచ్చు. 

25 గ్రాముల నుంచి ఎంత మొత్తం బంగారంతోనైనా డిజైన్‌ని చేయించుకోవచ్చు. లైట్‌ వెయిట్‌లోనూ కంటె డిజైన్లు చేయించుకోవచ్చు.  వివాహ వేడుకలలో ప్రత్యేకంగా కనిపించడానికి ఈ డిజైన్‌ బాగా అమరుతుంది. ఆభరణాల అలంకరణలో వయసుతో నిమిత్తం లేనప్పటికీ కంటె ఆభరణానాన్ని 50 ఏళ్ల లోపు వయసువారికి బాగా నప్పుతుంది. నవతరం అమ్మాయిలు ఆధునిక దుస్తుల మీదకు అలంకరించుకోవాలంటే స్టైల్‌గా ఉండే నెక్‌పీస్‌ కావాలి. ఇందుకు సన్నటి డిజైన్లలో ఉన్న కంటెను ఎంపిక చేసుకోవచ్చు.  ఒకప్పుడు ప్లెయిన్‌గా ఉండే కంటెకు రాళ్లు, రత్నాలు పొదిగి, పెండెంట్లు జత చేయడం కంఠాభరణం కమనీయంగా మారిపోయింది.
– శ్వేతారెడ్డి ఆభరణాల నిపుణురాలు

మరిన్ని వార్తలు