క్షత్రియధర్మం శ్రీ భగవాన్ ఉవాచ

21 Feb, 2016 00:31 IST|Sakshi
క్షత్రియధర్మం శ్రీ భగవాన్ ఉవాచ

స్వధర్మమపి చావేక్ష్య న వికంపితు మర్హసి
ధర్మ్యాద్ధి యుద్ధాచ్చ్రే యో న్యత్ క్షత్త్రియస్య న విద్యతే. (2-31)
యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వార మపావృతమ్
సుఖినః క్షత్రియాః పార్థౌ లభన్తే యుద్ధ మీదృశమ్(2-32)


 ‘‘అర్జునా! నీవు క్షత్రియుడవు కదా! క్షత్రియుడికి ధర్మయుద్ధం కన్నా శ్రేయస్కరమైనది మరొకటి ఉన్నదా? అయాచితంగా లభించిన ఇటువంటి ధర్మయుద్ధాలు క్షత్రియులకు తెరవబడిన స్వర్గద్వారాలు అని తెలియవా?’’
క్షత్రియధర్మం గురించి చెబుతూ శ్రీకృష్ణభగవానుడు సమత్వభావాన్ని గురించి సెలవిచ్చిన విషయాలను తెలుసుకుందాం. ‘‘అర్జునా! స్వధర్మమైన క్షత్రియధర్మాన్ని నీవు పాలించక, పరధర్మమైన భిక్షాటనాన్ని ఆశ్రయించి ధర్మయుద్ధం చేయకపోయినట్లయితే పాపం వస్తుంది. లోకులు నీ అధర్మప్రవర్తనను గురించి చెప్పుకొంటారు. పరువు ప్రతిష్ఠలు గలవారికి అపకీర్తి కన్నా చావే నయం కదా! నీవు బంధువులపై జాలిపడి యుద్ధం చేయనంటున్నావు కానీ ఇక్కడ చేరి ఉన్న మహారథులందరూ నిన్ను గురించి ఏమని భావిస్తారో తెలుసా? నీవు వారి పరాక్రమానికి జడిసి యుద్ధం మానుకొన్నావని పరిహాసం చేస్తారు. దాంతో ఇంతకు ముందున్న నీ కీర్తి అంతా బూడిదలో పోసిన పన్నీటి చందంగా మారుతుంది. నీ శత్రువులు అనరాని మాటలాడి నిన్ను, నీ సామర్థ్యాన్ని తెగనాడతారు. అంతకు మించిన దుఃఖమేముంది? కాబట్టి యుద్ధం చెయ్యి.
 - కూర్పు: బాలు శ్రీని
 (క్షాత్రధర్మాన్ని గురించిన మరికొన్ని సంగతులు వచ్చేవారం)

మరిన్ని వార్తలు