బంకర్‌ బాయ్‌

6 Jun, 2020 02:31 IST|Sakshi

క్రియేటివిటీ ఉన్నవారు సంచలన వార్త దొరికిన వెంటనే తమకు అనువుగా మార్చుకుంటారు అనటానికి బంకర్‌ బాయ్‌ పాటే నిదర్శనం. యూట్యూబ్‌లో ‘బంకర్‌ బాయ్‌’ పాటను వినేవారంతా సరదాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గత ఆదివారం బంకర్‌లోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ వార్తను పాటగా మలచుకున్నారు గీతరచయిత, గాయని కోర్ట్నీ జాయే. చేతిలో జార్జియస్‌ గిటార్‌ను ప్లే చేస్తూ, తియ్యనైన సౌండింగ్‌ వోకల్స్‌తో, అందరినీ ఆకర్షించే లిరిక్స్‌తో తయారుచేశారు ఈ వీడియో. వెనుక భాగంలో ౖÐð ట్‌ హౌస్‌ పెన్సిల్‌ స్కెచ్‌ కూడా కనిపిస్తుంది. 2013 లో విడుదల చేసిన ‘లవ్‌ అండ్‌ ఫర్‌గివ్‌నెస్‌’ ఆల్బమ్‌ టాప్‌ 50లో నిలబడింది. దీనిని అప్పుడు ట్రంప్‌కి అంకితం చేశారు జాయే. ఇప్పుడు తాజాగా విడుదల చేసిన వీడియోలో... ‘బంకర్‌ బాయ్‌ (దాగున్న ఓ అబ్బాయీ), డోంట్‌ లై  (అబద్ధాలు చెప్పకు), యు గాట్‌ స్కేర్‌డ్‌ అండ్‌ హిడ్‌ ఇన్‌ ద బేస్‌మెంట్‌ ఇన్‌ ద మిడిల్‌ ఆఫ్‌ ద నైట్‌ (నువ్వు భయంతో అర్ధరాత్రివేళ అండర్‌ గ్రౌండ్‌లో దాగున్నావు) అంటూ ప్రారంభమయ్యే ఈ పాట, ‘నవంబర్‌ ఈజ్‌ కమింగ్‌ అండ్‌ వియ్‌ హోప్‌ యూ ఆర్‌ టెర్రిఫైడ్, బంకర్‌ బాయ్‌’ (నవంబరు వస్తోంది, అప్పుడు నీకు ముప్పు తప్పదని భావిస్తున్నాం) అంటూ పాటను ముగించి, హమ్మయ్య అన్నట్లుగా పెద్దగా శ్వాస తీసుకుని, కళ్లను గుండ్రంగా తిప్పుతూ, ప్రశాంతంగా పాటకు ముగింపు పలికారు జాయే. నవంబరులో వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌కి వ్యతిరేకంగా ఓటు చేయాలనే వ్యంగ్యం ఈ పాటలో వినిస్తుంది. జాయే ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మీద పాటలు రాసి, బాగా పాపులర్‌ అయ్యారు. జూన్‌ ఒకటో తారీఖున ‘లక్‌ దిస్‌ ఫకింగ్‌ ప్రెసిడెంట్‌’ పేరున ఒక పాటను షేర్‌ చేశారు. దానిని కొన్ని మిలియన్ల మంది అతి కొద్ది సమయంలోనే చూశారు. 2018లో వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ సియాన్‌ స్పైసర్‌ కొద్దిసేపు పొదలలో దాగున్న సమయంలో ‘బుషీ బాయ్‌’ అనే పాట విడుదలై, బాగా పాపులర్‌ అయ్యింది. ఈ బంకర్‌ బాయ్‌ పాటను ఆ పాట ఆధారంగా రాసి ఉంటారని చాలామంది ట్వీట్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు